క్రాస్‌పోలో టీజర్‌ను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, త్వరలోనే భారత మార్కెట్లో ఓ కొత్త క్రాసోవర్/కాంపాక్ట్ ఎస్‌యూవీ 'క్రాస్‌పోలో'ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో క్రాస్‌పోలోకు సంబంధించి ఓ టీజర్ ఫోటొను ఉంచింది.
ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ క్రాస్‌పోలోను అభివృద్ధి చేశారు. ఇది రెగ్యులర్ వెర్షన్ పోలో కన్నా అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండనుంది. ఈ కారులో పెద్ద అల్లాయ్ వీల్స్, ముందు, వెనుక వైపు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ కారు బాడీలో క్రింది భాగాలను ధృడమైన ప్లాస్టిక్‌తో రూపొందించారు.

పోలో టిడిఐ హైలైన్ (టాప్ ఎండ్ వేరియంట్)లో ఉపయోగించిన 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో క్రాసోవర్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో నేడు (ఆగస్ట్ 22, 2013న) భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారుకు సంబంధించి ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫోక్స్‌వ్యాగన్ క్రాస్‌పోలో కేవలం సింగిల్ వేరియంట్ (డీజిల్ హైలైన్)లో మాత్రమే లభ్యం కానుంది
- దీని ధర రెగ్యులర్ వెర్షన్ టిడిఐ హైలైన్ కన్నా రూ.65,000 అధికంగా ఉండొచ్చని అంచనా
- క్రోమ్ టచ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ అండ్ రియర్ 'క్రాస్' బంపర్స్
- క్రోమ్ గార్నిష్‌తో కూడిన 'క్రాస్' గ్రిల్
- సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్
- వెనుక డోర్లపై 'క్రాస్' డెకాల్స్
- కొత్త 15 ఇచ్ అల్లాయ్ వీల్స్
- సిల్వర్ కలర్ సైడ్ మిర్రర్స్
- సుపీరియర్ లివియన్ బ్లాక్ అప్‌హోలెస్ట్రీ



Click it and Unblock the Notifications








