పాత వ్యాగన్ఆర్ బుకింగ్స్ బంద్, త్వరలో కొత్త వెర్షన్ విడుదల

By Ravi

మారుతి సుజుకి త్వరలో ఓ కొత్త వ్యాగన్ఆర్ కారును విడుదల చేయనుందని తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రస్తుతం మారుతి సుజుకి డీలర్లు పాత వ్యాగన్ఆర్ (2012 వెర్షన్) కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని నిలిపివేశారు. గడచిన సంవత్సరంలో దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నాల్గవ స్థానంలో నిలిచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ సరికొత్త 2013 వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో, 2012 వెర్షన్ వ్యాగన్ఆర్ బుకింగ్‌లను స్వీకరించడాన్ని కొందరు డీలర్లు నిలిపివేశారు. ప్రస్తుత వ్యాగన్ఆర్‌ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా కంపెనీ తీర్చిదిద్దిన సరికొత్త 2013 వ్యాగన్ఆర్‌ను కంపెనీ ఇప్పటికే తమ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో ఉపయోగించడం జరిగింది. భారతీయ పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మారుతి సుజుకి రూపొందించిన 1 నిమిషం నిడివి గల ఈ టివి కమర్షియల్‌లో సరికొత్త వ్యాగన్ఆర్ కారును గమనించవచ్చు.

కొత్త వ్యాగన్ఆర్ ఫ్రంట్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులను గమనించవచ్చు. కొత్త వ్యాగన్ఆర్ ఫ్రంట్ గ్రిల్ పాత వెర్షన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. అంతేకుండా పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, సరికొత్త ఫాగ్‌ల్యాంప్ డిజైన్ వంటి మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్స్‌లో కూడా చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. కానీ యాంత్రికపరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుత వ్యాగన్ఆర్ కారులో ఉపయోగించిన 998సీసీ ఇంజన్‌నే కొత్త వ్యాగన్ఆర్‌లో ఉపయోగించనున్నారు. ఇది కూడా పెట్రోల్, సిఎన్‌జి, ఎల్‌పిజి వెర్షన్లలో లభ్యం కానుంది.

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్

More from DriveSpark

Article Published On: Monday, January 7, 2013, 17:35 [IST]
English summary
The Maruti Suzuki Wagon R, India's fourth highest selling car in 2012 is all set for a revamp. In a clear sign of a new Wagon R being ready for launch, Maruti Suzuki dealers have stopped taking bookings for the current model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+