మార్చి 4న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల: రూమరా.. నిజమా..?
ఫోర్డ్ ఇండియా నుంచి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' విడుదలకు ముహుర్తం ఖరారైనట్లుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ బుజ్జి ఎస్‌యూవీ దేశీయ విపణిలో విడుదల కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల గురించి ఫోర్డ్ ఇండియా అధికారిక తేదిని వెల్లడించకపోయినప్పటికీ, వచ్చే నెల 4వ తేదీన ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. బడ్జెట్‌లో ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం వెల్లడించే అంశాలను బట్టి ఫోర్డ్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను నిర్ణయించాలని యోచిస్తోన్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. తాజాగా వెల్లడైన యూనియన్ బడ్జెట్ 2013-14లో చిన్న కార్లపై (4 మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగి ఉండే కార్లు) ఎక్సైంజ్ సుంఖాన్ని అలానే ఉంచడంతో ఫోర్డ్ ఇండియా ఊపిరి పీల్చుకున్నట్లయింది. వాస్తవానికి ఫోర్డ్ ఇండియా ఇప్పటికే ఈ కారును స్థానికంగా ఉత్పత్తి చేయటాన్ని కూడా ప్రారంభించింది. అలాగే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను కొన్ని ప్రముఖ డీలర్‌షిప్‌ల స్టాక్ యార్డ్‌లకు కూడా తరలించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పట్ల ఇప్పటికే క్రేజ్ ఉండటంతో, దీనిని విడుదల చేసిన వెంటనే భారీ డిమాండ్ ఏర్పడగలదని కంపెనీ యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ డెలివరీ విషయంలో జాప్యం జరగకుండా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మార్చి 4, 2013న మార్కెట్లో విడుదల కానుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌పై ఓ కన్నేసి ఉంచండి..!



Click it and Unblock the Notifications








