రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ ఉత్పత్తిపై త్వరలోనే నిర్ణయం!
ఈ ఫొటోలలో కనిపిస్తున్న కన్వర్టిబిల్ ఎస్‌యూవీ గుర్తుందా..? గడచిన సంవత్సరం జరిగిన 2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తమ "రేంజ్ రోవర్ ఎవోక్"లోఓ కన్వర్టిబిల్ వేరియంట్ ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ప్రపంచంలో కెల్లా తొలి కన్వర్టబిల్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)గా ఖ్యాతి దక్కించుకున్న ఈ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టబిల్ కాన్సెప్ట్ దశను ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చాలా వరకు కాన్సెప్ట్ వాహనాలను కాన్సెప్ట్ దశలోనే మిగిలిపోతుంటాయి. అయితే రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబిల్ కాన్సెప్ట్ మాత్రం అలా కాకుపండా ప్రొడక్షన్ స్టేజ్‌కు చేరుకోనుంది. ఈ మేరకు కంపెనీ ఓ అధికారిక నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. జెనీవా మోటార్ షోలో రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టబిల్ అశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది.
ఈ కన్వర్టిబల్ వెర్షన్‌కు లభించిన స్పందనను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీనిని ఉత్పత్తి దశకు తీసుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విశాలమైన ఫోర్-సీటర్ కన్వర్టబిల్ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీలో యాంత్రికంగా నియంత్రించబడే మెకానికల్ సాఫ్ట్ రూఫ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డులో ఉండే ఓ బటన్‌ను ప్రెస్ చేయగాన్ టాప్ తొలగిపోయి వెనక బూట్ స్పేస్‌లోకి మడుచుకుంటుంది. ఈ రూఫ్ బరువు సుమారు 80 కిలోలు ఉంటుంది. ఈ బరువు స్టాండర్డ్ 3-డోర్ ఎవోక్‌లో ఉపయోగించే రూఫ్ కన్నా అధికం.

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్

రేంజ్ రోవర్ కన్వర్టిబల్ కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








