న్యూయార్క్‌లో మెరిసిన కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్ కారు
కియా మోటార్స్ అమెరికా, డిసి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు గడచిన సంవత్సరం 'మనమే హీరోలు కావచ్చు' అనే ఓ క్యాంపైన్‌తో ముందుకు వచ్చాయి. ఈ క్యాంపైన్‌ను ఆఫ్రికాలోని ఆకలి బాధ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు రూపొందించటం జరిగింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా రెండు సంస్థలు డిసి కామిక్స్ జస్టిస్ లీగ్ క్యారెక్టర్ల ఆధారంగా కియా మోడళ్లను తయారు చేయాలని ప్రకటించాయి.
ఇందులో భాగంగా మొత్తం ఎనిమిది క్యారెక్టర్లను ప్రతిభింభించేలా కియా 8 కార్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో కియా మోటార్స్ ఇప్పటికే ఏడు కార్లను ఆవిష్కరించగా, తాజాగా ఎనిమిదవ కారును న్యూయార్క్ మోటార్ షోలో ఆవిష్కరించింది. బ్యాట్‌మ్యాన్ ఆప్టిమా ఎక్స్ లిమిటెడ్, సైబ్రాగ్ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఫోర్టే 5-డోర్, గ్రీన్ లాంథర్ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన సౌల్, ఆక్వామ్యాన్ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన రియో 5-డోర్, ఫ్లాష్ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఫోర్టే కౌప్, సూపర్‌మ్యాన్ కియా ఆప్టిమా హైబ్రిడ్ కార్లను కియా మోటార్స్ తయారు చేసింది.
కాగా ఇప్పుడు వండర్ ఉమెన్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన వండర్ ఉమెన్ స్పోర్టేజ్ కారును కియా ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శనకు ఉంచింది. వండర్ ఉమెన్ క్యారెక్టర్ యూనిఫారమ్ కలర్‌ను ఆధారంగా చేసుకొని దీనిని పెయింట్ చేశారు. రెడ్ కలర్ బాడీపై నక్షత్రాలు, గీతలు, గోల్డ్ లైన్లను గమనించవచ్చు. వెనుక విండ్‌షీల్డ్‌పై వండర్ ఉమెన్ చిత్రాన్ని కూడా అమర్చారు. బ్లూ కలర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌ను ఉపయోగించారు. కారు క్రింది భాగంలో కూడా బ్లూ కలర్ ఎల్ఈడిలను అమర్చారు.
స్పోర్టేజ్ కారు ఫ్రంట్ గ్రిల్‌పై వండర్ ఉమెన్‌ను తలపించేలా డబ్ల్యూ డబ్ల్యూ అనే లైన్స్, బ్లూకలర్ లైనింగ్‌తో కూడిన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీయర్స్‌తో దీనిని కస్టమైజ్ చేశారు. మరి ఈ వండర్ ఉమెన్ కారు విశేషాలేంటో తిలకిద్దాం రండి..!

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్

కియా వండర్ ఉమెన్ స్పోర్టేజ్



Click it and Unblock the Notifications








