జమైకాలో హల్‌చల్ చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా నానో

By Ravi

భారత మార్కెట్లో అంతంత మాత్రంగా అమ్ముడుపోతున్న ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు టాటా నానో ఇప్పుడు జమైకా మార్కెట్లో సందడి చేస్తుంది. జమైకాలో టాటా నానో కార్లను దిగుమతి చేసుకునేందుకు మెటిస్ మోటార్స్‌ను తమ అధీకృత దిగుమతిదారుగా టాటా మోటార్స్ నియమించుకుంది.

గడచిన సంవత్సరంలోనే టాటా మోటార్స్ తమ బుల్లి కారును జమైకన్లకు పరిచయం చేసింది. అక్కడి మార్కెట్లో విడుదలకు ముందే ఈ మోడల్‌కు బహుళ ప్రచారాన్ని కల్పించేందుకు రెండు నానో కార్లతో కంపెనీ భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. జమైకా రోడ్లు మన భారతీయ రోడ్ల కంటే మరీ అధ్వాన్నంగా ఉంటాయని, అయినప్పటికీ ఆ రోడ్లపై సైతం నానో సాఫీగా ప్రయాణం సాగిస్తుందని అంతేకాకుండా, జమైకాలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా నానోయే అని మెటిస్ మోటార్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

జమైకాలో టాటా నానో కేవలం టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ఇంజన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జమైకాలో టాటా నానో 60 ఎమ్‌పిజి (మైల్స్ పర్ గ్యాలన్) మైలేజీని (అంటే లీటరుకు 26 కి.మీ.) ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఇది మన దేశంలో లభిస్తున్న నానో మైలేజ్ కన్నా 1 కి.మీ. మైలేజ్ అధికమన్నమాట. జమైకాలో టాటా నానో ధర 9,99,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.5.51 లక్షలు).

Nano

More from DriveSpark

Article Published On: Saturday, May 18, 2013, 12:00 [IST]
English summary
Tata Motors has launched its people's car Tata Nano in Jamaica. Metis Motors has been appointed as the official importer of the Nano is Jamaica. Nano is priced at 990,000 Jamaican Dollars (around Rs. 5.51 lakhs).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+