ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కారు: ధర రూ.321 కోట్లు!

By Ravi

కొన్ని వస్తువులను డబ్బుతో కొనగలం., అలాగే కొన్ని వస్తువులు డబ్బును కొనగలవు.. విచిత్రంగా ఉంది కదూ.. ఇప్పుడ మనం చెప్పుకోబోయేది అలాంటి ఓ విశిష్టమైన వస్తువు గురించే. ఇది ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును చూడండి. చూడటానికి పాత డొక్కు కారులా కనిపించే ఈ కారు ధర అక్షరాల 321 కోట్ల రూపాయిల.

ధర వినగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది కదూ.. ఈ 1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్ ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైనా కారుగా నిలిచింది. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ లావాదేవీలో పేరు చెప్పడానికి ఇష్టపడటని ఓ కోటీశ్వరుడు ఈ అరుదైన కారు కోసం 52 మిలియన్ అమెరికన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు 321 కోట్ల)ను వెచ్చించి సొంతం చేసుకున్నాడు.

మరి ఈ పురాతన 1963 ఫెరారీ 250 జిటిఓ రేసర్ ఇంత అధిక వెల పలకడానికి కారణం, అలాగే ఇందులో ఉన్న అంతటి గొప్ప విశిష్టతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

ఈ 1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కారు 1962-1964 మధ్య కాలంలో ఉత్పత్తిన కేవలం 39 కార్లలో ఒకటి. రేసింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అప్పట్లో ఈ కార్లను తయారు చేశారు.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

గతంలో ఇంత అధిక ధర పలికి రికార్డు సృష్టించిన కారు కూడా ఫెరారీ 250 జిటిఓ రేస్ కారే (అయితే, అది గ్రీన్ కలర్ కారు). ఆ కారును అప్పట్లో స్టెర్లింగ్ మోస్ నడిపారు. వేలంలో ఆ కారు ధర 35 మిలియన్ డాలర్లు పలికింది.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

ఈ ఫెరారీ 250 జిటిఓ కార్లను గియోట్టో బిజారినీ నేతృత్వంలోని బృందం సృష్టించింది. ఈ రేసింగ్ కార్లను రోడ్ వెర్షన్ 250 జిటి ఎస్‌డబ్ల్యూబి మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

ఫెరారీ 250 జిటిఓ రేస్ కారులో 300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను 250 టెస్టా రోస్సాస్ కారులో కూడా ఉపయోగించారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉండే ఈ కారు గరిష్టంగా గంటకు 280 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

ఫెరారీ 250 జిటిఓ కార్లకు అభిమానులు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించడాన్ని చూసిన నిపుణులు, వీటిని మోనాలీసా కార్లని పిలుస్తున్నారు.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

వాస్తవానికి 1950-60 కాలానికి చెందిన అరుదైన, క్లాసిక్ ఫెరారీ కార్ల వెల ఏడాదికేడాది సగటున 15 శాతానికి పైగా పెరుగుతోంది.

1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్

ఇలాంటి ఓ కారుకు 52 మిలియన్ డాలర్లకు మించి అయినా చెల్లింపు చేయగల సామర్థ్యం కలిగిన ధనికులు ఉన్నారని, అయితే ఇలాంటి లావాదేవీలన్నీ ప్రైవేట్‌గా జరిపోతుంటాయి కాబట్టి, వీరు వెలుగులోకి రారని నిపుణులు అంటున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, October 18, 2013, 14:27 [IST]
English summary
One 1963 Ferrari 250 GTO recently became the most expensive car in the world. The said car was bought by an unknown billionaire who paid a staggering $52 million for this rare car. That's 321 crores in Indian rupees!! The car was sold at a private auction and the sale only became known after it was confirmed to Bloomberg News.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+