2013 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ వెంటోపై రూ.1.56 లక్షల రాయితీ!

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్ ఇప్పుడు రూ.1.56 లక్షల డిస్కౌంట్‌తో లభ్యం కానుంది. 2013 మోడల్ వెంటో సెడాన్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా వెంటో కంఫర్ట్‌లైన్ డీజిల్ వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా కంపెనీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ కార్పోరేట్లకు మాత్రమే.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో 'ప్రిఫర్డ్ ఎడిషన్' పేరట 2013 వెంటో కంఫర్ట్‌లైన్ డీజిల్‌పై రూ.75,000 నగదు తగ్గింపును, 30,000 ఎక్సేంజ్ బోనస్‌ను మరియు రూ.51,000 విలువైన యాక్ససరీలను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ యాక్ససరీస్‌లో భాగంగా.. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ లైన్డ్ విండోస్, ఫాక్స్ లెథర్ సీట్ కవర్స్ లభిస్తాయి.

2013 Volkswagen Vento

నాన్ కార్పోరేట్లు కూడా తగ్గింపును పొందవచ్చు, అయితే వీరికి యాక్ససరీ బెనిఫిట్లు ఉండవు. 2013 మోడల్ వెంటో కంఫర్ట్‌లైన్ డీజిల్ వెర్షన్ కొనుగోలుపై వీరు రూ.75,000 నగదు తగ్గింపును, రూ.30,000 ఎక్సేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

2013 ఫోక్స్‌వ్యాగన్ కంఫర్ట్‌లైన్ డీజిల్ వెర్షన్ ధర రూ.9.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది (రూ.1.56 లక్షల తగ్గింపుకు ముందు ధర). వెంటో డీజిల్ కంఫర్ట్‌లైన్‌ 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 29, 2014, 10:55 [IST]
English summary
VW is offering concessions worth as much as INR 1.56 lakhs for the 2013 Vento sedan. The discounts, available in Delhi, is available only on the Comfortline diesel variant of the Vento.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+