ఆటో ఎక్స్‌పో 2014: ఫేస్‌లిఫ్ట్ రెనో కొలియోస్‌

By Ravi

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈనెల 3వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ ప్రీమియం ఎస్‌యూవీ రెనో కొలియోస్‌ను, ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద జరగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

సరికొత్త 2014 రెనో కొలియోస్ ప్రీమియం ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇదివరకు ఈ ఎస్‌యూవీ కేవలం ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌లో కేవలం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా.. ఇప్పుడు కొత్త ఫేస్‌లిఫ్ట్ రెనో కొలియోస్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో పాటుగా టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టారు.


ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో ఉంది. టూ-వీల్ డ్రైవ్ కేవలం మ్యాన్యువవ తేదీన భార ల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. అన్ని వేరియంట్లు కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తాయి. అయితే, వేరియంట్‌ను బట్టి ఇంజన్ ట్యూనింగ్ వేరుగా ఉంటుంది.

ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌‌లోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 173 పిఎస్‌ల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌లోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 150 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సును ఆటోమేటిక్ వేరియంట్లోల 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సులను ఉపయోగించారు.

2014 Renault Koleos

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, బేస్ మోడల్‌లో సింగిల్ టోన్ అల్లాయ్ వీల్స్, 4x4 మోడళ్లలో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో బోస్ ఆడియో సిస్టమ్, ఈఎస్‌పి, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రిస్ సీట్ అడ్జస్టమెంట్, లెథర్ సీట్స్ వంటి ఫీచర్లను తొలగించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2014, 11:49 [IST]
English summary
The French automobile giant Renault have just unveiled the 2014 edition of their premium SUV at the ongoing Delhi Auto Expo 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+