చైనాలో 2015 షెవర్లే క్రూజ్ సెడాన్ విడుదల
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న షెవర్లే క్రూజ్ సెడాన్ త్వరలోనే కొత్త అవతారంలో కనిపించనుంది. షెవర్లే 2014 బీజింగ్ మోటార్ షోలో రిఫ్రెష్డ్ వెర్షన్ క్రూజ్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ కొత్త 2015 షెవర్లే క్రూజ్ సెడాన్ చైనా మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది.
కొత్త షెవర్లే క్రూజ్ సెడాన్‌ను జనరల్ మోటార్స్ చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. చైనా మార్కెట్లో విడుదలైన షెవర్లే క్రూజ్ సెడాన్ బేస్ వేరియంట్ ధర రూ. 10.80 లక్షలుగా ఉంటే, పూర్తి ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 16.73 లక్షలుగా ఉంది.

ఈ రిఫ్రెష్ట్ వెర్షన్ షెవర్లే క్రూజ్ త్వరలోనే ఇండియన్ మార్కెట్‌కు కూడా రానుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో లభిస్తున్న ఇంజన్ ఆప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి:
టర్బోచార్జ్డ్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్. 148 బిహెచ్‌పి పవర్, 235 ఎన్ఎమ్ టార్క్.
రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. 112 బిహెచ్‌పి పవర్, 146 ఎన్ఎమ్ టార్క్.
టర్బోచార్జ్డ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్. 165 బిహెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టార్క్.
అయితే, ఇండియన్ మార్కెట్లో ఈ మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయా లేక ఇది కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఇక కొత్త క్రూజ్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, రీడిజైన్ చేసిన బంపర్, హెడ్‌ల్యాంప్స్, ఫాగ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్‌ను కూడా రీడిజైన్ చేశారు. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. బ్లాక్ అండ్ బ్రౌన్ డ్యూయెల్ టోన్ థీమ్‌తో డిజైన్ చేసిన ఇంటీరియర్స్, రీడిజైన్ చేయబడిన ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, త్రీ-స్పోక్ లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ బటన్స్, రీవ్యాంప్ చేసిన గేర్‌నాబ్ మరియు సెంటర్ కన్సోల్ వంటి మార్పులు ఉన్నాయి. ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








