ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 2015 ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‍యూవీ ఎండీవర్‌లో అప్‌గ్రేడెడ్ వేరియంట్ త్వరలోనే విడుదల కానుంది. అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన ఆస్ట్రేలియా విభాగం, ఫోర్డ్ ఆస్ట్రేలియా గడచిన ఆగస్ట్ నెలలో ఆవిష్కరించిన 'ఫోర్డ్ ఎవరెస్ట్' అనే అధునాతన కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని, కంపెనీ ఓ కొత్త ఎండీవర్ ఎస్‌యూవీని తయారు చేయనుంది.
పలు అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని ఫోర్డ్ ఎవరెస్ట్ పేరుతో విక్రయించనున్నారు. ఆసియా మార్కెట్లలో (భారత్‌తో కలిపి) మాత్రం దీనిని ఫోర్డ్ ఎండీవర్ అనే పేరుతో విక్రయిస్తున్నారు. ఈ కొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్) కాన్సెప్ట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి దశకు చేరుకోనుంది. అంతేకాకుండా, వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కూడా ఫోర్డ్ ఇండియా ఈ సరికొత్త ఎస్‌యూవీని ప్రదర్శించే అవకాశం ఉంది.

ఈ కొత్త ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ (లేదా నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్) విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ విడుదల చసిన సమాచారం ప్రకారం, ఇందులో 2.2 లీటర్, 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. అలాగే ఇందులో 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను కూడా ఫోర్డ్ పరిచయం చేసే ఆస్కారం ఉంది (ఇండియన్ వెర్షన్లోని ఇంజన్ల విషయాలు తెలియాల్సి ఉంది).

ఫోర్డ్ ప్రస్తుత డిజైన్ ల్యాంగ్వేజ్‌ను ప్రతిభింభింప జేసే ట్రాపేజోయిడల్ క్రోమ్ గ్రిల్ (ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో చూసినట్లుగా) కనిపిస్తుంది. ఈ 2015 ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్లోని టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్) కాన్సెప్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








