నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియా టీజర్ విడుదల
చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫ్యాబియాలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవలే అఫీషియల్ స్కెచ్‌లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా స్కొడా తమ 2015 ఫ్యాబియా టీజర్ ఫొటోను విడుదల చేసింది. ఈ టీజర్ ఫొటోలో కేవలం హెడ్‌లైట్ మాత్రమే కనిపిస్తుంది.
స్కొడా తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగనున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించనుంది. సరికొత్త 2015 స్కొడా ఫ్యాబియాలో కాస్మోటిక్ మార్పులతో పాటుగా మెకానికల్ మార్పులు కూడా ఉండనున్నాయి.
పెట్రోల్ వెర్షన్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ ఇంజన్ మరియు 1.2 లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ 1.4 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో ఓ గ్రీన్‌లైన్ డీజిల్ ఇంజన్‌ను కూడా 2015లో పరిచయం చేయనున్నారు.

ఈ ఇంజన్లన్నీ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్‌లను కస్టమర్ల కోరిక మేరకు ట్యూన్ చేసి ఇస్తారు. ఉదాహరణకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 60 బిహెచ్‌పిల నుంచి 110 బిహెచ్‌పిల వరకు, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను 75 బిహెచ్‌పిల నుంచి 105 బిహెచ్‌పిల వరకు ట్యూన్ చేసిస్తారు. వచ్చే ఏడాదిలో ఈ కొత్త స్కొడా ఫ్యాబియా ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.
ఇండియన్ మార్కెట్‌కు రానున్న నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియాలో 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications








