230 బిహెచ్‌పి సూపర్ టాటా నానో ఆవిష్కరణ
ఈ ఫొటోలో కనిపిస్తున్న టాటా నానో కారు సాదాసీదా నానో కారు కాదు. ఇదొక సూపర్ టాటా నానో. పేరుకు తగినట్లుగానే ఇది అత్యంత శక్తివంతమైన కారు. ప్రస్తుత టాటా నానో కేవలం 37 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంటే, ఈ సూపర్ నానో మాత్రం ఏకంగా 230 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఆటోకార్ పెర్ఫార్మెన్స్ షోలో జేఏ మోటార్‌స్పోర్ట్ ఈ సూపర్ నానోను ప్రదర్శనకు ఉంచింది. ఈ కారులో జేఏ మోటార్‌స్పోర్ట్ స్వతహాగా అభివృద్ధి చేసిన 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 230 బిహెచ్‌పిల శక్తిని, 8500 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ సూపర్ టాటా నానో కేవలం 6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కరి మోటార్ స్పీడ్‌వే డిమాండ్ మేరకు ఈ కారు గరిష్ట వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే, బుధ్ ఇంటర్నేషనల్ వంటి సర్క్యూట్‌పై అయితే, ఈ కారులో గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చు.

ఈ సూపర్ టాటా నానో కారులో వేగానికి తగినట్లుగా బాడీ స్టైల్ (ఏరోడైనమిక్స్)ని మార్చారు. అలాగే స్టీరింగ్ వీల్‌ను ఫార్ములా వన్ స్టైల్‌లో డిజైన్ చేశారు. డ్రైవింగ్ కంఫర్ట్ కోసం బకెట్ సీట్లను ఏర్పాటు చేశారు. రోడ్ గ్రిప్ కోసం ఎమ్ఆర్ఎఫ్ జెఎల్ఓ రేసింగ్ టైర్లను అమర్చారు. ఈ కారులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌కు బదులుగా 6-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిషన్)ని ఉపయోగించారు.
గేర్లను మ్యాన్యువల్‌గా సులువుగా మార్చుకునేందుకు వీలుగా స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్టర్లను అమర్చారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన టాటా నానో చీప్‌గా మాత్రం లభించదండోయ్. సాధారణ టాటా నానో కారు ధర కన్నా ఈ సూపర్ నానో ధర దాదాపు 10 రెట్లు అధికం. అంటే సుమారు రూ.25 లక్షలు అన్నమాట. మరి మీకు సూపర్ నానో కావాలా లేక మామూల నానో కావాలా..?


Click it and Unblock the Notifications








