దీపావళి గిఫ్ట్: ఉద్యోగులకు 500 ఫియట్ పుంటో ఇవో కార్లు
సాధారణంగా దీపావళి పండుగ వచ్చిందంటే, పలు కంపెనీలు/సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లను, కానుకలను అందజేస్తుంటాయి. కానీ ఓ సూరత్‌లోని ఓ డైమండ్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా 500 ఫియట్ పుంటో ఇవో కార్లను కానుకగా ఇచ్చిందట.
ఈ సంవత్సరానికి గాను టార్గెట్లను చేరుకున్న తమ ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా కొత్త కార్లను ఆఫర్ చేస్తున్నట్లు సదరు డైమండ్ కంపెనీ పేర్కొంది. వాస్తవానికి గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఉన్న వజ్రాల పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కుంటోంది, అయినప్పటికీ ఉద్యోగులు మాత్రం తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతున్నారు.

ఆసక్తికరమైన విషయంయ ఏటంటే, ఈ ఉద్యోగులలో చాలా మందికి కార్ డ్రైవింగ్ కూడా తెలియదు, అయినప్పటికీ కారును కానుకగా పొందటం పట్ల వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. తాము గడచిన సంవత్సరమే ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసుకున్నామని, లక్ష్యాలు చేరుకున్న 1200 మంది ఉద్యోగులను తాము సత్కరించామని, కంపెనీ ఓనర్ చెప్పుకొచ్చారు. ఊహించని కానుక లభించడంతో, ఉద్యోగులందరూ తమ కంపెనీ యజమానిని పొగడ్తలతో ముంచేస్తున్నారు.


Click it and Unblock the Notifications








