ఎయిర్‌బ్యాగ్ సమస్యతో హ్యుందాయ్ ఎస్‌యూవీల రీకాల్

By Ravi

కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్స్‌ అమెరికాతో పాటు పోర్టారికోలలో విక్రయించిన 1,40,000 ఎస్‌యువీలను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. అమెరికా ఆటో భద్రతా నియంత్రణా సంస్థకు ఆదేశం మేరకు హ్యుందాయ్‌ ఈ రీకాల్ చేసింది.

కాగా.. ఇప్పటి వరకు ఎయిర్‌బ్యాగ్‌ లోపం వల్ల ఎవరు గాయపడినట్లు సమాచారం లేదని హ్యుందాయ్ తెలిపింది. డ్రైవర్‌ స్టీరింగ్‌ కాలమ్ వద్ద ఉండే బోల్టులకు సంబంధించిన లోపాలను గుర్తించామని, తాము విక్రయించిన హ్యుందాయ్ టక్సన్ కాంపాక్ట్‌ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌లో ఈ సమస్యను గుర్తించామని కంపెనీ పేర్కొంది.

Hyundai Tucson Recall
ఈ వాహనాల్లో విడిభాగాలను అసెంబ్లింగ్‌ చేసేటప్పడు రెండు బోల్టులను సరిగా టైట్ చేయలేదని, ఒకవేళ బోల్ట్‌ ఊడిపోతే స్టీరింగ్‌ వీల్‌ నుంచి ఎయిర్‌బ్యాగ్‌లు విడిపోతాయని, అలాంటి సందర్భంలో ప్రమాదం జరిగినప్పడు డ్రైవర్‌ గాయపడే ప్రమాదం ఉందని హ్యుందాయ్ వివరించింది. 2011 నుంచి 2014 మధ్య కాలంలో విక్రయించిన హ్యుందాయ్ టక్సన్ కార్లలో ఈ సమస్యలు ఉన్నాయి.

అమెరికాలో విక్రయించిన 1,37,500 యూనిట్లు మరియు పోర్టారికోలో విక్రయించిన 3,500 యూనిట్ల టక్సన్ వాహనాలను ఈ రీకాల్‌‌కు వర్తిస్తాయి. వాస్తవానికి ఈ విషయం హ్యుందాయ్‌ దృష్టికి 2013 డిసెంబర్‌లో వచ్చింది. కారు యజమానులు తమ సమీపంలోని డీలర్ల వద్దకు కారును చూపించుకోవాలని యజమానులను కోరింది.

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2014, 9:11 [IST]
English summary
South Korean automaker Hyundai is recalling 140,000 vehicles in the United States and Puerto Rico because of an air bag problem, according to documents filed with US auto safety regulators. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+