సరిగ్గా గుద్దుకోలేదు కాబట్టే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదు!

By Ravi

కారు సరిగ్గా గుద్దుకోని కారణంగా ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదట. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తూ ఓ టొయెటా డీలర్ చెప్పిన మాట. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అనీల్ నాయర్ టొయోటా ఎతియోస్ కారును ఉపయోగిస్తున్నారు. ఓ రోజు ఇతను తమ టొయోటా ఎతియోస్ కారులో ఎర్నాకులం-అల్లెప్పీ హైవేపై వెళ్తున్నప్పుడు నేరుగా ఓ ఎస్‌యూవీని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో అనీల్ నాయర్ స్వల్ప గాయాలతో బయటపడగా, కో-ప్యాసింజర్ సీటులో ఉన్న వ్యక్తి రెండు వారాల పాటు ఆస్పత్రి పాలయ్యాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నప్పటికీ, అని ఓపెన్ కాలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత, అనీల్ నాయర్ టొయోటా డీలరును సంప్రదించి ఎయిర్‌బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నించారు.

అనీల్ ప్రశ్నకు టొయోటా డీలరు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. 'మీరు సరిగ్గా యాక్సిడెంట్ చేయలేదు కాబట్టే, ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదు' అని. ఈ సమాధానాం విన్న అనీల్ నాయర్ అవాక్కైపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటన షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరి ఈ విషయంపై టొయోటా అధికారుల స్పందన ఏంటో తెలుసుకోవాలంటే, ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టొయోటా ఎతియోస్ యాక్సిడెంట్

ఈ సంఘటనపై స్పందించిన కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్ రాజా ఓ అఫీషియల్ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. సప్లిమెంట్ రెస్ట్రైన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ డిప్లాయ్‌మెంట్ (ఓపెన్ కావటం) అనేది కొన్ని నిర్ధిష్ట పరిమితులకు లోబడి ఉంటుంది.

టొయోటా ఎతియోస్ యాక్సిడెంట్

ఉదాహరణకు.. కనీసం గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం, కుడి లేదా ఎడమ వైపు నుంచి 30 డిగ్రీల కోణంలో, ఎదురుగా వస్తున్న కారును లేదా గోడను ఢీకొన్నప్పుడు మాత్రమే ఎస్ఆర్ఆర్ డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. వాహనం సైడ్ నుంచి కానీ లేగా వెనుక నుంచి కానీ ప్రమాదానికి గురైనప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావు.

టొయోటా ఎతియోస్ యాక్సిడెంట్

అనీల్ నాయర్ విషయంలో, ఎతియోస్ వాహనం ఎడమ చేతి వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టిందని, ఈ సమయంలో ప్రమాద తీవ్రతను ఎక్కువగా ఎస్‌యూవీ గ్రహించడం మరియు ఈ ప్రమాద తీవ్రత ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడానికి అవసరమయ్యే పరామితులకు సరిపోకపోవటం కారణంగా ఎతియోస్ కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాలేదని ఆయన వివరించారు.

ఏదేమైనప్పటికీ, ప్రమాద తీవ్రత చిన్నదైనా, పెద్దదైనా ప్రాణం విలువ మాత్రం వెలకట్టలేనిది. ఇటీవలి సంఘటనలను చూస్తుంటే, ఇండియాలో తయారైన కార్లు ఎంత మేరకు సురక్షితమైనవో అనే సందేహం అందరిలోను కలుగక తప్పదు.

టొయోటా ఎతియోస్ యాక్సిడెంట్

ఇది కూడా చదవండి: ఎయిర్ బ్యాగ్స్ వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు, అవెలా పనిచేస్తాయి?


Photos: Ajit Menon

More from DriveSpark

Article Published On: Wednesday, November 26, 2014, 9:30 [IST]
English summary
Mr. Anil Nair found out recently when he met with an accident at the Ernakulam-Alleppey highway in Kerala. His Toyota Etios was involved in frontal collision on the highway, and yet the airbags failed to deploy. While he faced some serious injuries, the co-passenger was hospitalised for 2 weeks. When Mr. Nair contacted his Toyota dealer and informed them about the case, the dealer replied "It's because you did not collide properly." 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+