పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

స్మార్ట్‌‌ఫోన్లకు మాత్రమే పరిమితమైన యాపిల్ టెక్నాలజీ, ఇప్పుడు కార్లలోను అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ఇటీవలే ఆటోమొబైల్స్ కోసం 'యాపిల్ కార్ ప్లే' (Apple CarPlay) పేరిట ఓ సరికొత్త ఇన్-కార్ ఇంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీని యాపిల్ ఐఎన్‌సి పరిచయం చేసిన సంగతి తెలిసినదే.

కాగా.. కార్ ఆడియో/ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో పేరుగాంచిన పయోనీర్ సంస్థ ఇప్పుడు తొలిసారిగా ఈ యాపిల్ కార్ ప్లే టెక్నాలజీని తమ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో పరిచయం చేసింది. ఆడియో కార్ ప్లే టెక్నాలజీని ఉపయోగించిన మొట్టమొదటి ఇన్ఫోటైన్‌మెంట్ ఎక్వింప్ మేకర్ కూడా పయోనీర్ సంస్థే కావటం విశేషం. కార్లలో ఆఫర్ చేయబోయే ఈ యాపిల్ కార్ ప్లే టెక్నాలజీకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

ఐప్యాడ్, ఐఫోన్ లేదా ఐపాడ్ వంటి అన్ని రకాల యాపిల్ గ్యాడెట్స్‌లో ఉండే ఫీచర్లను, అప్లికేష్లను ఈ యాపిల్ కార్ ప్లే ద్వారా పొందవచ్చు, ఈ సిస్టమ్‌తో ఇన్-కార్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోతుందని కంపెనీ పేర్కొంది.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

యాపిల్ కార్ ప్లే సిస్టమ్ కలిగిన పయోనీర్ సిస్టమ్స్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. డేటా కేబుల్ సాయంతో ఐఫోన్లను ఈ సిస్టమ్‌తో లింక్ చేసుకోవచ్చు. ఇదే కేబుల్ ఐఫోన్‌ను చార్జ్ చేయటానికి కూడా సహకరిస్తుంది.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

ఈ సిస్టమ్ మెసేజెస్, మ్యాప్స్, ఐట్యూన్స్ రేడియో వంటి ఐఓఎస్ అప్లికేషన్లను సపోర్ట్ చేయటంతో పాటుగా, స్పోటిఫై వంటి థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌లను కూడా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

యాపిల్ కార్ ప్లే సిస్టమ్ కలిగిన పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో యాపిల్ నుంచి అత్యంత పాపులర్ అయిన సిరి వాయిస్ కమాండ్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు. స్క్రీన్ క్రింది భాగంలో ఉండే బటన్‌ను నొక్కి ఉంచితే, యాపిల్ వాయిస్ కమాండ్ టూల్ యాక్టివేట్ అవుతుంది.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

ఇందులో డిఫాల్ట్ నావిగేషన్ సిస్టమ్ (పవర్డ్ బై గూగుల్ మ్యాప్స్) ఉంటుంది. దీని సాయంతో సమీపంలోని కాఫీ షాపులు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, సర్వీస్ సెంటర్లు మొదలైన అనేక వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నావిగేషన్ సిస్టమ్ కూడా వాయిస్ కమాండ్‌కు రెస్పాండ్ అవుతుంది.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

ఈ వాయిస్ కమాండ్ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్‌కి వచ్చిన టెక్స్ట్ మెసేజ్‌లను వినడమే కాకుండా, వాటిని రిమోట్‌గానే రిప్లయ్ కూడా ఇవ్వవచ్చు. అంతేకాకుండా, మీకు కావల్సిన సమాచారాన్ని నోటితో కమాండ్ చేయటం ద్వారా గూగుల్ సెర్చ్ కూడా చేసి పొందవచ్చు.

పయోనీర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్‌లో 'యాపిల్ కార్ ప్లే'

ఈ సిస్టమ్ యాపిల్ ఫోన్లలో ఫీచర్లను సపోర్ట్ చేయటమే కాకుండా డివిడి, సిడి, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ వంటి ఇతర ప్లేబ్యాక్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ, స్వంత జిపిఎస్, ఇన్-బిల్ట్ ట్రాఫిక్ మెసేజెస్, డిజిటల్ రేడియో కోసం డిఏబి ట్యూనర్ వంటి ఫీచర్లు కూడా ఈ సిస్టమ్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 21, 2014, 15:45 [IST]
English summary
Pioneer has launching three multimedia systems that can be fitted to any vehicle and feature Apple CarPlay to offer smartphone control from behind the wheel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+