ఆటో ఎక్స్‌పో 2014: ఏరియాన్ ప్రోటాన్ ఎలక్ట్రిక్ బైక్

By Ravi

ఆటో ఎక్స్‌పో 2014లో కేవలం సాంప్రదాయ ఆటోమొబైల్ వాహనాలే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, కాన్సెప్ట్ వాహనాలు మరియు హైబ్రిడ్ వాహనాలు కూడా వీక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి ఓ విశిష్టమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిలే ఈ 'ఏరియాన్ ప్రోటాన్'. పూనేకి చెందిన ఏరియన్ మోటార్స్ తమ హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఈ ప్రోటాన్ ఒక పూర్తి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. దీనిని ఏరియన్ సంస్థను నిర్వహిస్తున్న ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇందులోని హై పెర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ కంట్రోలర్ సాయంతో నడుస్తుంది. ఎల్‌టెక్ ఎలక్ట్రోడిజైన్స్ సహకారంతో ఏరియాన్ ఈ ఎలక్ట్రిక్ కంట్రోలర్‌ను తయారు చేశారు. ఏరియాన్ అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ కంట్రోలర్‌ను చిన్నపాటి మోడిఫికేషన్‌తో అనేక రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఉపయోగించుకోవచ్చునని కంపెనీ పేర్కొంది.


ఏరియాన్ ప్రోటాన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 24 హెచ్‌పి, బ్రష్డ్ డిసి మోటార్‌ను ఉపయోగించారు (ఈ మోటార్‌ను అగ్ని మోటార్స్ నుంచి గ్రహించారు). ఈ మోటార్ 72 వోల్ట్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావటానికి పట్టే సమయం 5 గంటలు. పూర్తి చార్జ్‌తో ఈ ఏరియాన్ ప్రోటాన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
Areion Motors Proton Electric Motorcycle At Auto Expo 2014

ఏరియాన్ ప్రోటాన్ కేవలం 8.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. తమ ప్రోటాన్ ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్ ఖర్చుకు లేకుండా, ఓ హై స్పీడ్ బైకింగ్ అనుభూతిని అందిస్తుందని ఏరియాన్ కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2014, 14:29 [IST]
English summary
Areion Motors has displayed their high speed electric bike called “PROTON” at the 12th Indian Auto Expo 2014. A startup from Pune in Maharashtra founded by a group of engineers, Areion, takes pride in presenting its high performance electric controller installed in Proton. This milestone represents the pinnacle of Areion as electric bike manufacturers. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+