జిఎమ్ ఇండియాకు కొత్త బాస్‌గా అరవింద్ సక్సేనా

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీలోకి జంప్ కొట్టారు. అరవింద్ సక్సేనాను తమ కొత్త ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించుకుంటున్నామని జనరల్ మోటార్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోవెల్ పడ్డాక్ నుంచి అరవింద్ సక్సేనా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. లోవెల్ పడ్డాక్ ఇప్పుడు జిఎమ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ యొక్క ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వెళ్లనున్నారు.

Arvind Saxena

అరవింద్ సక్సేనాకు ఈ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా అనుభం ఉంది. ఆయన ఎస్కార్ట్స్ లిమిటెడ్‌ యొక్క మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ విభాగంలో ఏరియా మేనేజర్‌గా 1983లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బజాజ్ కంపెనీకి మారారు. మూడేళ్ల తర్వాత మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌లో రీజనల్ మేనేజర్‌గా చేరారు.

అనంతరం ఆయన ఫియట్ ఇండియాలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి మారుతి సుజుకిలో సేల్స్ విభానికి జనరల్ మేనేజర్‌గా చేరారు, అక్కడి నుంచి సేల్స్ విభాగానికి చీఫ్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ అయ్యారు.

జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీలోకి చేరడానికి ముందు అరవింద్ సక్సేనా ఫోక్స్‌వ్యాదన్ ప్యాసింజర్ కార్స్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గాను మరియు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియాకు బోర్డ్ సభ్యులు గాను ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, March 1, 2014, 13:39 [IST]
English summary
General Motors confirmed appointment of Arvind Saxena, yesterday. He has been appointed as President and Managing Director of GM India, effective 1st March, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+