అశోక్ లేలాండ్ పార్ట్‌నర్ ఎల్‌సివి, మరో మినీ బస్ విడుదల
దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం అశోక్ లేలాండ్ మరియు జపనీస్ కార్‌మేకర్ నిస్సాన్‌ల నుంచి మరో రెండు కొత్త వాహనాలు విడుదలయ్యాయి. ఇప్పనిటే నిస్సాన్-ఆశోక్ లేలాంజా జేవీ నుంచి దోస్త్ ఎల్‌సివి మరియు స్టైల్ ఎమ్‌పివిలు అందుబాటులో ఉండగా, తాజాగా మరో రెండు కొత్త వాహనాలను అందుబాటులోకి వచ్చాయి.
ఇవి రెండూ కూడా తేలికపాటి రవాణా వాహనాలే. ఇందులో వాటిలో పార్టనర్ అనే మినీ ట్రక్ మరొకటి ఎమ్ఐటిఆర్ అనే మినీ బస్సు. అశోక్ లేలాండ్ పార్ట్‌నర్ మినీ ట్రక్కును ప్రపంచ స్థాయిలో ప్రమాణాలతో రూపొందించామని, దీని యూరోపియన్ స్టైల్ క్యాబిన్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ క్యాబిన్‌లో ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ తక్కువగా ఉంటాయని, మోడ్రన్ ఇంటీరియర్స్, డ్రైవర్ యుటిలిటీ స్పేస్‌లు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయని కంపెనీ వివరించింది.

రవాణా రంగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా, వాహనాన్ని నడిపే డ్రైవర్‌కు ఎటువంటి పరిస్థితులలోనైనా ఎలాంటి ఆపదా రాకుండా ఉండేలా దీని క్యాబిన్ రూపొందించినట్ల సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.సుమంతరాన్ తెలిపారు. భవిష్యత్తులో అశోకాలేలాండ్, నిస్సాన్ జెవి సంస్థలు సంయుక్తంగా మరిన్ని వాహనాలను రూపొందించనుందని, రవాణా వాహనాల తయారీలో అశోకాలేలాండ్‌కు ఉన్న డిమాండ్ ను దృష్టిలోపెట్టుకొని మరిన్ని రవాణా వాహనాలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
దేశీయ మార్కెట్లో అశోక్ లేలాండ్ పార్టనర్ ఎల్‌సివి ధరలు రూ.9.19 లక్షల నుంచి రూ.9.49 లక్షల రేంజ్‌లో ఉండగా, 26 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఎమ్ఐటిఆర్ స్టాండర్డ్ బస్ ధర రూ.12.49 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ తెలిపింది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications








