స్కొడా ర్యాపిడ్ సెడాన్ కోసం ప్రత్యేక ఆఫర్లు

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'స్కొడా ర్యాపిడ్' కోసం మూడు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. 'ర్యాపిడ్ మాన్‌సూన్ ఆఫర్స్' పేరిట ఈ సెడాన్ కోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌లతో పాటుగా పలు ఇతర ప్రోత్సాహకాలన స్కొడా ఆఫర్ చేస్తోంది. తమ స్వంత ఫైనాన్స్ డివిజన్ స్కొడా ఫైనాన్స్ ద్వారా 7.99 శాతం వడ్డీ రేటుకే రుణాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

ఆఫర్ 1: స్కొడా 5 X 5 ఎక్స్‌పీరియెన్స్
* రూ.1కే మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్
* రూ.15,000 ఎక్సేంజ్ బోనస్
* 5 ఏళ్ల వారంటీ (2 ఏళ్ల స్టాండర్డ్ వారంటీ + 3 ఏళ్ల అదనపు వారంటీ)
* 7.99 శాతం వడ్డీ రేటు (స్కొడా ఫైనాన్స్ ద్వారా)
* 5 ఏళ్ల ఉచిత స్కొడా అసిస్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్

ఆఫర్ 2: ఎక్స్‌క్లూజివ్ 7 ఇయర్స్ ఫైనాన్స్ స్కీమ్
* 7 ఏళ్ల (84 నెలల) పాటు రుణం
* రూ.1కే మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్
* 5 ఏళ్ల వారంటీ (2 ఏళ్ల స్టాండర్డ్ వారంటీ + 3 ఏళ్ల అదనపు వారంటీ)
* 5 ఏళ్ల ఉచిత స్కొడా అసిస్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్

ఆఫర్ 3: అప్‌గ్రేడ్ టూ ర్యాపిడ్
* అప్‌గ్రేడ్ ఈఎమ్ఐ స్కీమ్ (ప్రస్తుత కారును ర్యాపిడ్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకునే వారి కోసం)
* రూ.1కే మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్
* రూ.15,000 ఎక్సేంజ్ బోనస్

ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని స్కొడా అధీకృత డీలరును సంప్రదించండి.

Skoda Rapid

స్కొడా ర్యాపిడ్‌ విషయానికి వస్తే.. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2014, 12:23 [IST]
English summary
Skoda Finance is offering attractive finance offers for its Rapid sedan. Get 5 years of complete peace of mind with 5 years extended warranty and 5 years SKODA Assist road side assistance included. Additionally, you also get rewarded with an exchange bonus and the first year’s insurance at just ₹ 1. Optionally, you can also avail of a loan at just 7.99% interest p.a.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+