కేవలం 3 నెలల్లోనే 1000 ఆడి ఏ3 కార్లు అమ్ముడుపోయాయి.
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ3' (Audi A3) హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. కేవలం రూ.22.95 లక్షల (బేస్ డీజిల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే భారత మార్కెట్లో విడుదలైన ఆడి ఏ3 సెడాన్, సరసమైన ధరకే ఆడి కారును సొంతం చేసుకోవాలనే అనేక మంది ఆడి బ్రాండ్ ప్రియుల కలను నిజం చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ
ఆడి ఏ3 సెడాన్ భారత మార్కెట్లో విడుదలై నేటి (నవంబర్ 7. 2014)తో సరిగ్గా మూడు నెలలు పూర్తయింది (ఆగస్ట్ 7, 2014న ఈ కారు భారత్‌లో విడుదలైంది). ఇప్పటి వరకూ ఆడి ఇండియా సుమారు 1000 యూనిట్లకు పైగా ఆడి ఏ3 కార్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఆడి ఇండియా భారత మార్కెట్లో మొత్తం 10,002 కార్లను విక్రయించి, దేశంలో కెల్లా తొలిసారిగా 10,000 యూనిట్లకు పైగా లగ్జరీ కార్లను విక్రయించిన తొలి లగ్జరీ కార్ బ్రాండ్‌గా నిలిచింది.

ఈ ఏడాది ఆడి నుంచి మరిన్ని కొత్త మోడళ్లు మార్కెట్లో విడుదలైన నేపథ్యంలో, ఈ క్యాంలెండర్ ఇయర్‌లో ఆడి ఇండియా అమ్మకాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆడి ఏ3 కారును ఔరంగాబాద్‌లోని తమ ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ అసెంబ్లింగ్ చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆరవ మోడల్ ఆడి ఏ6. ఈ ప్లాంట్‌లో ఇప్పటికే ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7 మోడళ్లను అసెంబ్లిగ్ చేస్తున్నారు.
దేశీయ విపణిలో ఆడి ఏ3 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. కొత్త ఆడి ఏ3 సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 1.8 లీటర్, టిఎఫ్ఎస్ఐ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 177.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మరొకటి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 141 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








