2013లో 10 వేలకు పైగా కార్లను విక్రయించిన ఆడి ఇండియా

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా 2013వ సంవత్సరాన్ని విజయవంతంగా ముగించింది. గడచిన డిసెంబర్‌తో ముగిసిన 2013 సంవత్సరంలో ఆడి ఇండియా అమ్మకాలు 11 శాతం వృద్ధి చెంది 10,002 యూనిట్లుహా నమోదయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆడి ఇండియాకు ఇదే అత్యధిక వార్షిక అమ్మకాలు రికార్డ్. అంతేకాదు, భారత్‌లో ఒక్క సంవత్సరంలో 10 వేల కార్లను విక్రయించిన మొట్టమొదటి లగ్జరీ కార్ కంపెనీ కూడా ఇదే. ఆడి ఇండియా 2012వ సంవత్సరంలో మొత్తం 9003 కార్లను విక్రయించింది.

ఆడి విజయవంతమైన బ్రాండ్‌గా ఎదుగుతుందోని, కంపెనీ ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 10,002 కార్లను విక్రయించిందని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. కాగా.. ఆడి ప్రత్యర్థి మెర్సిడెస్ బెంజ్ ఇండియా గడచిన 2013 సంవత్సరంలో మొత్తం 9,003 కార్లను విక్రయించింది. గడచిన 2012తో పోల్చుకుంటే 2013లో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు ఏకంగా 31.62 శాతం వృద్ధి చెందాయి. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇంకా తమ అమ్మకాల ఫలితాలను వెల్లడించలేదు.

Audi Sales

ఆడి ఇండియా ఒక్క డిసెంబర్ 2013 నెలలోనే మొత్తం 1,340 కార్లను విక్రయించింది. కంపెనీకు ఇదే అత్యధిక నెలవారీ విక్రయాలు కూడా కావటం మరో విశేషం. అయితే, సరఫరా ఇబ్బందుల వల్ల సుమారు 450 కార్లు ఈ జనవరి 2014 నెలలో డెలివరీ చేయనున్నారు. కస్టమర్ల సాన్నిహిత్య చర్యలో భాగంగా, ఈ వాహనాలను జనవరిలో డెలివరీ చేసినప్పటికీ, డిసెంబర్ 2013 ధరకే వీటిని విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. జనవరి 1, 2014వ తేది నుంచి ధరలను పెంచుకున్న ఆడి ఇండియా గతంలో ప్రకటించిన సంగతి తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2014, 13:09 [IST]
English summary
The German luxury car maker has recorded 10,002 sold units in 2013, a 11% bump up in sales. Audi is the first luxury car manufacturer to reach the goal of 10,000 cars sold in a calendar year. It had sold a decent 9003 units in 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+