2015లో పది కొత్త మోడళ్లను విడుదల చేయనున్న ఆడి!

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి, భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని స్థిరపరచుకునేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది దేశీయ విపణిలో 10 కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

భారత లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీల నుంచి ఆడి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. అయినప్పటికీ, ఆడి తమ వ్యూహాలను అమలుపరచుకుంటూ పోతోంది. ఆడి ఇండియా ఈ ఏడాది ఇప్పటికే దేశీయ విపణిలో 10,000 లకు పైగా కార్లను విక్రయించింది.

గడచిన సంవత్సరం (2013)లో ఆడి ఇండియా 10,003 కార్లను విక్రయించింది. ఆడి ఇటీవలే తమ ఏ3 మోడల్‌‌లో ఓ కొత్త కన్వర్టిబల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఆడి ఏ3 కన్వర్టిబల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Audi A3 Cabrio

ఆడి ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో మొత్తం 17 మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది పవర్‌ఫుల్ ఆర్8 ఎల్ఎమ్ఎక్స్, ఆడి టిటి మోడళ్లను కూడా విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ రెండు మోడళ్లు ఆడి 2015లో విడుదల చేయాలనున్న 10 మోడళ్లలోవే.

ప్రపంచ మార్కెట్లలో ఆడి ఇండియా హ్యాచ్‌బ్యాక్స్‌తో పాటుగా విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందిస్తోంది. తమ గ్లోబల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మంచి విజయం సాధించిన కార్లను ఇండియాలో కూడా పరిచయం చేయాలని ఆడి ఇండియా యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 13, 2014, 11:10 [IST]
English summary
German automobile manufacturer Audi, has plans of launching 10 new models in 2015, to maintain its crown as the leader in the luxury car segment in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+