ఎయిర్‌బ్యాగ్ సమస్య: 6,758 యూనిట్ల ఆడి ఏ4 కార్ల రీకాల్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయించిన ఏ4 సెడాన్‌లో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు గాను, కంపెనీ మొత్తం 6,758 యూనిట్ల ఆడి ఏ4 కార్లను రీకాల్ చేసింది.
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!
ఇవన్నీ నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేయబడినవని, రీకాల్ చేయబడిన ఈ ఆడి ఏ4 కార్లలో కేవలం ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తే సరిపోతుందని, ఎలాంటి పరికరాలను మార్చీల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.

అత్యవసర సమయాల్లో ఎయిర్‌బ్యాగ్స్ సమర్థవంతంగా విచ్చుకునేందుకు గాను ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం జరుగుతుందని కంపెనీ వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆడి ఇండియా డీలర్లు తమ ఏకస్టమర్లు ఏ4 కస్టమర్లను సంప్రదించి, ఈ క్యాంపైన్ గురించి వివరిస్తారని, వారితో అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత, వర్క్‌షాపుకు తీసుకువచ్చే కార్లలో ఉచితంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తారని కంపనీ పేర్కొంది.
లోపపూరితమైన ఎయిర్‌బ్యాగ్‌లను రిపేర్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆడి రీకాల్ చేసిన 8.5 లక్షల ఏ4 కార్లలో భాగంగానే, భారత్‌లో కూడా ఈ రీకాల్ చేశారు. ఇదివరకు ఆడి మార్చ్-డిసెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన ఆడి క్యూ7 ఎస్‌యూవీలను బ్రేక్ సిస్టమ్‌లోని ఫాల్టీ వాక్యూమ్‌ని రీప్లేస్ చేయటానికి 382 యూనిట్లను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








