ఎయిర్‌బ్యాగ్ సమస్య: ప్రపంచ వ్యాప్తంగా 8.5 లక్షల ఆడి ఏ4 కార్ల రీకాల్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి అతిపెద్ద రీకాల్‌ను ప్రకటించింది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 8.5 లక్షల ఆడి ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గడచిన 2012 సంవత్సరం తర్వాత తయారైన అన్ని ఆడి ఏ4 కార్లలో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.

ఈ సమయంలో తయారైన ఆడి ఏ4 కార్లలో ఉపయోగించిన ఆడి స్వంత సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా యాక్సిడెంట్ సమయంలో ఆడి ఏ4 కారులోని ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోకుండాపోయే ప్రమాదం ఉందని కంపెనీ వివరించింది.

మొత్తం కార్లలో 1.5 లక్షల ఆడి ఏ4 కార్లను జర్మనీలో రీకాల్ చేసినప్పుడు ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ కార్లను అదే దేశంలో అసెంబ్లింగ్ చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సులువుగా అడ్జస్ట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

audi recall a4 for airbag issue

చైనాలో 2.5 లక్షల ఆడి ఏ4 కార్లను రీకాల్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏ4 సెడాన్, ఎస్టేట్ మరియు లాంగ్ వీల్‌బేస్ వెర్షన్లలో ఈ సాఫ్ట్‌వేర్ సమస్యను గుర్తించినట్లు సమాచారం.

ఆడి యూఎస్ఏ విడుదల చేసిన ప్రకటనలో.. 2013, 2014 సంవత్సరాల్లో తయారు చేసిన సుమారు 1,01,900 యూనిట్లు ఈ రీకాల్ వర్తించనున్నట్లు తెలిపింది. జపనీస్ ఎయిర్‌బ్యాగ్ సప్లయర్ టకటా కార్ప్ ఆఫర్ చేసిన ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన కార్లలో ఈ సమస్యలు ఉన్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఇతర కార్లు కూడా రీకాల్ చేయబడ్డాయి.

కాగా.. ఇదే సమస్యకు సంబంధించి ఇండియాలో తయారైన ఆడి ఏ4 కార్లు రీకాల్‌కు వర్తిస్తాయో లేదో అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ విషయానికి సంబంధించి ఆడి ఇండియా ఓ ప్రకటన చేయాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, October 24, 2014, 15:05 [IST]
English summary
Audi has detected a potential problem and have recalled 8,50,000 units of their premium sedan, the A4. The reason is the airbag for models built after 2012. The problem is with Audi's own software, that might not allow the airbag to deploy in case of a crash.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+