ఆడి టెక్నాలజీ మ్యాగజైన్ అన్నింటిలో కెల్లా బెస్ట్
జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ ఆడి తమ స్వంత టెక్నాలజీ మ్యాగజైన్ 'ఎన్‌కౌంటర్' (Encounter)ను ప్రచురిస్తోంది. ఈ మ్యాగజైన్ తాజాగా బి2సి ఆటోమోటివ్ సెక్షన్‌లో కెల్లా మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆడి యాన్యువల్ రిపోర్ట్ యాప్ కూడా ఇందులో పాల్గొన్న 700 అభ్యర్థులను జయించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
బెస్ట్ టెక్నాలజీ మ్యాగజైన్ కోసం మొత్తం 7 నామినీలు రాగా, ఆడి టెక్నాలజీ మ్యాగజైన్ ఎన్‌కౌంటర్ వాటన్నింటి దాటుకొనిపోయి రెండు బంగారు అవార్డులను దక్కించుకుంది. ఈ టెక్నాలజీ మ్యాగజైన్ సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కస్టమర్ల కోసం దీనిని ప్రచురిస్తున్నప్పటికీ, ఎక్కువగా జర్నలిస్టులనే ఇది టార్గెట్ చేసుకుంటుంది.

ఈ అవార్డును ప్రకటించిన జ్యూరీ ప్యానెల్ వివరించిన దాని ప్రకారం, ఆడి టెక్నాలజీ మ్యాగజైన్ సుపీరియర్ రిపోర్టింగ్‌తో పాటుగా పిక్టోరియల్ డిపిక్షన్ (ఫొటోలతో కూడి విశ్లేషణ) ఉంటుందని వారు తెలిపారు. ఆడి ఇంజనీర్లు తమ ప్రయోగశాలలో ఎలా పనిచేస్తారు, కొత్త ఆవిష్కరణలను మరియు సాంకేతికతలను ఎలా సృష్టిస్తారో ఈ మ్యాగజైన్‌లో స్పష్టంగా వివరిస్తారని తెలిపారు.
ఆడి టెక్నాలజీ మ్యాగజైన్ ఎన్‌కౌంటక్ గోల్డ్ అవార్డును గెలుచుకోవటం వరుసగా ఇది మూడవసారి. ఇకపోతే, ఆడి వార్షిక రిపోర్టును అందించే అప్లికేషన్ కూడా ఈ జ్యూరీ ద్వారా ఎన్నుకోబడినది. ఈ యాప్ ద్వారా పాడ్‌కాస్ట్స్, గ్యాలరీ, వీడియో మరియు స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. డెవలపర్లు ఈ యాప్ కోసం ప్రత్యేకించి కంటెంట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మ్యాగజైన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా లింక్ చేశారు.

ఈ బిసిపి అవార్డును గడచిన 2003 సంవత్సరం నుంచి ఫోరమ్ కార్పోరేట్ పబ్లిషింగ్ ప్రధానం చేస్తూ వస్తోంది. ఈ జ్యూరీని ఆస్ట్రియా, జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌లలోని ప్రముఖ సిపి పబ్లిషింగ్ సంస్థలు ఏర్పాటు చేశాయి. దాదాపు 150 మంది జ్యూరీ సభ్యులను ఆర్ట్ డైరెక్షన్, కార్పోరేట్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ అండ్ జర్నలిజం విభాగాల నుండి ఎంచుకుంటారు.


Click it and Unblock the Notifications








