బజాజ్ ఆర్ఈ60 ప్రొడక్షన్ వెర్షన్ ఆవిష్కరణ; వివరాలు

By Ravi

భారత సర్కార్ ఇటీవలే క్వాడ్రిసైకిళ్లకు అనమతి ప్రకటించిన నేపథ్యంలో, బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను వాణిజ్య పరంగా విడుదల చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ దిశలో భాగంగానే, ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తమ బజాజ్ ఆర్ఈ60 ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.

వివిధ రంగులు మరియు విభిన్నమైన బాడీ గ్రాఫిక్స్‌తో తయారు చేసిన సరికొత్త ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. అంతేకాకుండా, ఈ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా కంపెనీ వెల్లడి చేసింది.


బజాజ్ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌లో 216సీసీ లిక్విడ్ కూల్డ్, 4-వాల్వ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నారు. ఇది కంపెనీ యొక్క ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీతో లభ్యం కానుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గేర్ బాక్స్ డ్యాష్ బోర్డుకే ఫిక్స్ చేయబడి ఉంటుంది.

బజాజ్ ఆర్ఈ60 గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఇది మూడు విభిన్న ఇంజన్ వేరియంట్లలో (రెగ్యులర్ పెట్రోల్ యూనిట్, ఎల్‌పిజి యూనిట్ మరియు సిఎన్‌జి యూనిట్) లభ్యం కానుంది. ఇది లీటరుకు 37 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రతి కిలోమీటరుకు 60 గ్రాముల కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది.

Bajaj RE60 auto Expo

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2014, 12:49 [IST]
English summary
The quadricycle segment has still not been opened by the government, but it is now closer than ever to being formally announced and is likely to happen this year. Meanwhile, Bajaj Auto, the only company with a fully functional quadricycle has been waiting patiently to release its product in the market for several months now.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+