ఎగిరే కారును డిజైన్ చేయనున్న బెంగుళూరు ఇంజనీర్

By Ravi

ఫ్లయింగ్ కార్ డ్రీమ్‌ని నిజం చేసి చూపిస్తానంటున్నాడు బెంగుళూరుకి చెందిన 54-ఏళ్ల ఇంజనీర్ ఏకె విశ్వనాథ్. ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థలే ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నాయి. ఇప్పటికే టెర్రాఫుజియా, ఏరోమొబిల్ అనే సంస్థలు తమ తమ ప్రోటోటైప్ మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసినదే.

కాగా.. ఏకె విశ్వనాథ్ కూడా ఇదే తరహాలో నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఓ ఫ్లయింగ్ కారును తయారు చేస్తానని చెబుతున్నాడు. బిఎమ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన విశ్వనాథ్, టెర్రాఫుజియా మరియు ఏరోమొబిల్ సంస్థల మాదిరిగానే ఓ కాన్సెప్ట్ కారు తయారీ కోసం పేపర్ వర్క్ రెడీ చేసుకున్నాడు.

ఈ కాన్సెప్ట్ ఇంకా ప్రూఫ్‌కి వెళ్లాల్సి ఉంది. కీటకాలు ఎగిరే విధానం నుంచి స్ఫూర్తి పొంది తన ఫ్లయింగ్ కారును డిజైన్ చేస్తానని చెబుతున్నాడు. టెక్నాలజీ రీసైన్స్ చేసి, వచ్చే శతాబ్ధానికి సరిపోయేలా సృష్టించాలని విశ్వనాథ్ చెప్పారు.

Flying Car

గాలిలలో వివిధ రకాల కీటకాలు, గాలిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటూ ఎగురుతుంటాయి. సుమారు 20కి పైగా విభిన్నమైన కీటకాల యొక్క ఎయిర్‌ఫ్లోను రిప్లికెట్ చేస్తూ, గాలిలో ఎగిరిలే, నిలిచేలా, నిలువుగా టేకాఫ్ అయ్యేలాంటి కారును సృష్టించాలని భావిస్తున్నానని విశ్వనాథ్ తెలిపారు.

విశ్వనాథ్ దాదాపు 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బెంగుళూరులో జరగనున్న 2015 ఏరో ఇండియా షోలో విశ్వనాథ్ తన ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ మొదటి ప్రూఫ్‌ను ప్రదర్శించనున్నాడు. అతని పేరుపై ఇప్పటికే రెండు పేటెంట్లు ధాఖలై ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 27, 2014, 17:20 [IST]
English summary
A K Vishwanath, a 54 year-old engineer from Bangalore is making an attempt to design and launch a flying car, that can take off and land vertically.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+