భారత్‌లో బ్లావ్‌పంక్ట్ మొదటి అధికారిక షాప్ ప్రారంభం

By Ravi

కార్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సౌండ్ సిస్టమ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ 'బ్లావ్‌పంక్ట్' (Blaupunkt) భారత్‌లో ఇక ఉత్పత్తులను తామే స్వయంగా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు బ్లావ్‌పంక్ట్ కొచ్చిలో తమ తొలి స్టోర్‌ను ప్రారంభించింది. బ్లావ్‌పంక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ లార్స్ ప్లాక్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు.

ఇదివరకు బ్లావ్‌పంక్ట్ కేరళకు చెందిన టాప్‌మోస్ట్ గ్రూప్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించేంది. జర్మనీకి చెందిన ఈ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పరికరాల తయారీ సంస్థ ఇప్పటికే భారత మార్కెట్లో 'న్యూ ఓర్లియాన్స్ 220' (New Orleans 220), 'లాస్ వేగాస్ 530' (Las Vegas 530) వంటి పాపులర్ ఆడియో సిస్టమ్‌లను ఆఫర్ చేస్తోంది.


బ్లావ్‌పంక్ట్ రానున్న రెండేళ్లలో భారత మార్కెట్లో మరో 20 స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం బ్లావ్‌పంక్ట్ తమ బ్రాండ్ క్రింద స్పీకర్లు, వూఫర్లు, సబ్‌వూఫర్లు ఆడియో సిస్టమ్‌లను అందిస్తోంది. కాగా.. కొచ్చిలో కొత్తగా ఏర్పాటు చేసిన తమ అధికారిక షాప్‌లో తాము అందిస్తున్న అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లను విక్రయించనున్నారు.

బ్లావ్‌పంక్ట్ అందిస్తున్న లాస్ వేగాస్ 530 ఓ డబుల్ డిన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దీని ధర రూ.23,990 లుగా ఉంది. ఇది 6.2 ఇంచ్ డిజిటల్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉండి, బిల్ట్-ఇన్ బ్లూటూత్ కలిగి ఉంటుంది. దీని సాయంతో హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, ఫోన్ బుక్ డౌన్‌లోడ్, ఆడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రేడియో, డివిడి, విసిడి, సిడి, మైక్రో ఎస్‌డి కార్డ్ మరియు యూఎస్‌బి పోర్ట్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

Blaupunkt Launches First Brand Shop In India

ఇకపోతే.. ఓర్లియాన్స్ 220 ఆడియో సిస్టమ్ విషయానికి వస్తే, ఇది హై గ్రేడ్ ఎఫ్ఎమ్ (ఆర్‌డిఎస్), ఏఎమ్ ట్యూనర్, ఫ్రంట్ యూఎస్‌బి (మాస్ స్టోరేజ్ డివైజ్‌ల కోసం - స్టాండర్డ్ ఏ-టైప్) , ఐపాడ్/ఐఫోన్ కంట్రోల్ అండ్ చార్జింగ్ (యూఎస్‌బి ద్వారా), ఎమ్‌పి3 కంఫర్ట్ బ్రౌజింగ్ అండ్ ఐపాడ్ క్రైటీరియా సెలెక్షన్, ఐడి3-ట్యాగ్ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇంకా ఇందులో సెలక్టబల్ ఎమ్‌పి3 డిస్‌ప్లే మోడ్స్ (ట్యాగ్స్, ప్లే టైమ్ మొదలైనవి), సిడి ప్లేయర్ విత్ షాక్ ప్రూఫ్ మెమరీ, ఫ్రంట్ ఆక్స్-ఇన్ పోర్ట్, 3-బ్రాండ్ పారామెట్రిక్ ఈక్వలైజర్స్ (వేరియబల్ గెయిన్, ఫ్రీక్వెన్సీ, క్యూ-ఫ్యాక్టర్), సౌండ్ ప్రీసెట్స్ (రాక్, పాప్, జాజ్, ఫ్లాట్), 4-ఛానెల్ ప్రీయాంప్-అవుట్ (2 వోల్ట్స్) / సబ్-అవుట్ స్విచబల్, గరిష్ట సౌండ్ అవుట్‌పుట్ 4x50 వాట్స్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 15, 2014, 14:02 [IST]
English summary
Blaupunkt, who specialise in in-car entertainment systems, have setup their very first official store in Kochi, India. Present at the inauguration of their new store was Lars Placke, CEO and Managing Director, Blaupunkt.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+