బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లాంచ్ ఖరారు; టీజర్ ఫొటో, వీడియో విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన తమ మొట్టమొదటి హైబ్రిడ్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8' (BMW i8) ఈ ఏడాది ఇండియాకు తీసుకురానున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

ఈ మేరకు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ఐ8 హైబ్రిడ్ కారుకు సంబంధించి ఓ స్పెషల్ టీజర్ ఫొటోను అలాగే య్యూటూబ్‌లో ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది. రానున్న ఫిబ్రవరి 2014లో జరగనున్న 12వ ఎడిషన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఈ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును విడుదల చేయనుంది.

అయితే, భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే (బహుశా 7 లేదా 8 యూనిట్లు) లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, దీని ధరకు అంచనాలకు మించి ఉండొచ్చని (సుమారు రూ.1.5 కోట్లు) తెలుస్తోంది.

BMW i8 India Launch Confirmed

పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ హైటెక్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీతో తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాలకు) పవర్‌ను అందిస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాలకు పవర్‌ను చేరవేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు. ఇవి రెండు (పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్) కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ఉపయోగిస్తుంది. ఐ8లో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు.
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/o10t6HpSbNc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2014, 15:32 [IST]
English summary
It has been officially confirmed by BMW India. Bavarian Motor Works will be launching the i8 hybrid sports car in India at the 2014 Auto Expo next month. The automaker has done this through social media platforms, by the way of a teaser image on its Facebook fan page and a YouTube video.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+