BMW ఫైనాన్స్ హెడ్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణా పోలీసులు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఆర్థిక విభాగం బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఫైనాన్స్ హెడ్ స్టీఫెన్ డేవిడ్ స్క్లిఫ్‌ను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారు. డీలరు ద్వారా మోసం చేశారనే నెపంతో ఆయనను సికింద్రాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకున్నారు.
స్థానిక మెజిస్ట్రేట్‌లో శుక్రవారం స్టీఫెన్ డేవిడ్‌ను హాజరు పరచగా, కోర్టు ఆయను రోజుల రిమాండ్ విధించింది. నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ జయలక్ష్మి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. 2010 లో ఫైల్ చేసిన కేసులో భాగంగా ఈ ఆరెస్టు చేశామని వివరించారు.

డెల్టా కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరెన్ చౌదరి ఈ ఫిర్యాదు చేశారు. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఫైనాన్స్ హెడ్ చేసిన మోసం కారణంగా చౌదరి సుమారు 4 కోట్ల రూపాయాలు నష్టపోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోలీసులు ఇటీవలే ఆమ్‌వే ఇండియా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ విలియం స్కాట్ పింక్నీని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసినదే.
జర్మన్ బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థే ఈ బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ విభాగం రీటైల్ ఫైనాన్స్, కమర్షియల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అనే మూడు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ వీడియో చూశారా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Z-4v4I7Gzk0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








