రోజుకు రూ.555 చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ సొంతం చేసుకోండి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో తమ సరికొత్త 1-సిరీస్ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారీ అంచనాలతో విడుదైన బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్, కంపెనీ ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టడం లేదని తెలుస్తోంది. అందుకే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పుడు ఈ మోడల్‌సై ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రకటించింది.
బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఆర్థిక సేవల విభాగం బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ కొత్త స్కీమ్‌ని ప్రకటించింది. రోజుకు రూ.555లు చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ కారును సొంతం చేసుకోండంటూ కంపెనీ కస్టమర్లను ఊరిస్తోంది. ఈ స్కీమ్ క్రింద కస్టమర్లు కనీసం రూ.8-10 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మిగిలిన మొత్తాన్ని 7 ఏళ్లపాటు ఈఎమ్ స్కీమ్‌గా మార్చడం జరుగుతుంది.

ఈ స్కీమ్‌లో భాగంగా.. కస్టమర్లు మొదటి 11 నెలల పాటు రోజుకు రూ.555 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 12 నెలలకు ఒకసారి చొప్పున రూ.1.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీకు సమీపంలోని అధీకృత బిఎమ్‌డబ్ల్యూ ఇండియా డీలరును సంప్రదించండి).
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ విషయానికి వస్తే.. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్ టర్బో యూనిట్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 136 హార్స్ పవర్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్‌టి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ కారులో 2.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 143 హార్స్ పవర్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్‌టి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
కార్ యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు, త్వరపడండి
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌తో (కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఈకో ప్రో మోడ్స్) లభిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్, బి-క్లాస్, ఆడి క్యూ3 వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లతో పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








