వచ్చే వారంలో రిఫ్రెష్డ్ 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 విడుదల

By Ravi

ఇటీవలే 7-సిరీస్ సిగ్నేచర్ ఎడిషన్‌‌ను విడుదల చేసిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తాజాగా వచ్చే వారంలో మరో రిఫ్రెష్డ్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్స్3 ఎస్‌యూవీలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈనెల 28న మార్కెట్లో విడుదల చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్3 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అందుకున్న ఈ కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3లో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అయితే, ఇందులో యాంత్రిక పరంగా ఎలాంటి అప్‌గ్రేడ్స్ ఉండబోవు.


ఆగస్ట్ 28, 2014వ తేదీన తమ సరికొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనేక డిజైన్ మార్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్ నుంచి ప్రారంభమయ్యే ట్విన్ సర్క్యులర్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో ఇది సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిస్తుంది.

ఇంటీరియర్స్‌లో గ్లాసీ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, కొత్త లెథర్ సీట్స్ ఇదివరకటి కన్నా మెరుగ్గా అనిపిస్తాయి. ఈ కారు ఓవరాల్ డిజైన్ అండ్ డైమన్షన్స్ మాత్రం మారకుండా అలానే ఉంది. ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 2.0 లీటర్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఇంజన్‌ను మరింత ఎక్కువ పవర్‌ను ఆఫర్ చేసేలా అప్‌ట్యూన్ చేశారు (ప్రస్తుతం ఇది 184 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తిని చేస్తుంది).

BMW X3 Rear

కాగా.. 3.0 లీటర్ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంటులోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 23, 2014, 17:17 [IST]
English summary
German luxury car manufacturer BMW will be launching its new and refreshed 2014 X3 in India. The SUV will be launched in India on the 28th of August, 2014. BMW India is launching products in India on a regular basis, getting its global products here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+