జనవరి నుంచి పెరగనున్న బిఎమ్‌డబ్ల్యూ కార్ల ధరలు
కొత్త సంవత్సరంలో బిఎమ్‌డబ్ల్యూ కార్లు మరింత ప్రియం కానున్నాయి. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, వచ్చే నెల నుంచి తమ వాహన ధరలను పెంచాలని నిర్ణయించింది. జనవరి 1, 2015వ తేదీ నుంచి బిఎమ్‌డబ్ల్యూ, మినీ బ్రాండ్ కార్ల ధరలు 5 శాతం మేర పెరగనున్నాయి.
దీర్ఘకాలిక ఆలోచన, బాధ్యతాయుతమైన చర్యలపైనే బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా విజయం నిర్మించబడుతుందని, పటిష్టమైన బ్రాండ్ మరియు అత్యుత్తమ ఉత్పత్తులను ఆఫర్ చేయటం ద్వారా భారత మార్కెట్లో తాము తమ నాయకత్వ స్థానాన్ని కొనసాగించాలని భావిస్తున్నామని, ఈ ధరల పెంపుతో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో తమ ప్రీమియం స్థానాన్ని మెయింటైన్ చేయగలదని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సార్ తెలిపారు.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో 1-సిరీస్, 3-సిరీస్, 3-సిరీస్ గ్రాన్ తురిస్మో, 5-సిరీస్, 7-సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, 6-సిరీస్ గ్రాన్ కూపే, యాక్టివ్ హైబ్రిడ్ 7, ఎక్స్6, జెడ్4, ఎమ్3 సెడాన్, ఎమ్4 కూపే, ఎమ్5 సెడాన్, ఎమ్6 గ్రాన్ కూపే మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాదిలో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.
కంపెనీ విక్రయిస్తున్న లగ్జరీ స్మాల్ కార్ బ్రాండ్ మినీ క్రింద మినీ 3-డోర్, మినీ 5-డోర్, మినీ కన్వర్టిబల్, మినీ కంట్రీమ్యాన్ మోడళ్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








