మే 29న సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 విడుదల!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త అప్‌డేటెడ్ ఎక్స్5 ఎస్‌యూవీని రేపు (మే 29, 2014)న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మునుపటి వెర్షన్ కన్నా మరింత పెద్దదిగా, బోల్డ్‌గా మరియు స్పోర్టీయర్‌గా ఉండనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ సరికొత్త ఎక్స్5 మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 258 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొన్ని ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి. ఎల్ఈడి లైట్లతో కూడిన హెడ్‌లైట్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్‌తో దీని బాహ్య డిజైన్‌లో మార్పులు చేర్పులు ఉంటాయి.

BMW To Launch New X5

మునుపటి ఎక్స్5 కన్నా కొత్త ఎక్స్5 పెద్దదిగా ఉన్నప్పటికీ దాని కన్నా ఇది తేలికగా ఉండనుంది. ఇందులో 360 డిగ్రీ సరౌండ్ పార్కింగ్ అసిస్ట్, రోడ్ సైన్ ఇన్ఫో, వెంటిలేషన్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 4 గేజ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కోసం కంపెనీ గడచిన రెండు వారాల క్రితమే బుకింగ్‌లను ప్రారంభంచింది. ఈనెలలో బుక్ చేసుకున్న వారికి వచ్చే నెలలో కారు డెలివరీ అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2014, 11:38 [IST]
English summary
German luxury car manufacturer BMW will be bringing to India their updated X5 on the 29th of May, 2014. The new X5 is expected to be bigger, bolder as well as sportier than the outgoing model. BMW had revealed their new X5 at this years Auto Expo held in New Delhi in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+