స్నాప్‌డీల్ డాట్‌కామ్‌లో మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కొత్త స్కార్పియో కోసం మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్లు ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించారు. కాగా.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ (snapdeal.com) కూడా ఆన్‌లైన్‌లో కొత్త 2014 స్కార్పియో కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది.
అంతేకాకుండా.. స్నాప్‌డీల్ డాట్‌కామ్ కొత్త స్కార్పియో వేరియంట్ల వివరాలను మరియు కలర్ ఆప్షన్లను కూడా వెల్లడి చేసింది. దీని ప్రకారం, కొత్త తరం మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. అలాగే, ఇది డైమండ్ వైట్, ఫైరీ బ్లాక్, మిస్ట్ సిల్వర్, మోల్టెన్ రెడ్, రీగల్ బ్లూ అనే ఐదు ఆకర్షనీయమై రంగులలో లభ్యం కానున్నట్లు స్నాప్‌డీల్ పేర్కొంది.

కొత్త స్కార్పియో కోసం రూ.20,000 బుకింగ్ మొత్తాన్ని స్నాప్‌డీల్ స్వీకరిస్తోంది. ఒకవేళ స్కార్పియోను వద్దనుకొని బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకుంటే సదరు బుకింగ్ అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని స్నాప్‌డీల్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ కారుకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, పూర్తి ధర మరియు ఇతర వివరాలను సెప్టెంబర్ 25, 2014వ వెల్లడిస్తామని స్నాప్‌డీల్ పేర్కొంది.
కొత్త 2014 మహీంద్రా స్కార్పియోకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








