డ్యామేజ్ అయినా కూడా కోట్ల రూపాయల వెల పలికింది

By Ravi

ఏనుగు బ్రతికినా లక్షే, మరణించినా లక్షే అన్న సామెతగా.. సూపర్‌కార్లు కండిషన్‌లో లేదా డ్యామేజ్ అయినా కూడా కోట్ల రూపాయాల వెల పలుకుతాయి. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న డ్యామేజ్ అయిన 'బుగాటి వేరాన్' సూపర్‌కారును చూడండి. ఇంత దీనావస్థలో ఉండి కూడా ఇది 1,67,243 బ్రిటీష్ పొండ్ల వెల పలికింది.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఈ బుగాటి వేరాన్ సూపర్‌కారును, దాని యజమాని ఆస్ట్రియన్ ఆటోబాన్ రోడ్డుపై నడుపుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు ముందు కుడిచేతి వైపు భాగం బాగా దెబ్బతినడంతో పాటుగా వెనుక టైరు కూడా పేలిపోయింది.


దీంతో కారు క్రింది భాగం నేలను రాచుకుంటూ పోయి, బాడీ వర్క్, పెయింట్ వర్క్ డ్యామేజ్ అయ్యింది. మితిమీరన వేగం వలన కారును అదుపు చేలేకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కారు క్రింది భాగం రోడ్డుకు రాచుకుంటూ పోవటంతో సస్పెన్షన్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఈ స్థితిలో ఉన్న బుగాటి వేరాన్ కారును ప్రముఖ బీమా సంస్థ (ఇన్సూరెన్స్ కంపెనీ) ఆక్సా విక్రయించింది.

Veyron Wrecked

ఈ కొరును కొనుగోలు చేసే కస్టమర్ 167,243 పౌండ్లను చెల్లించడంతో పాటుగా రిపేరు ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రిపేర్లతో కలిపి ఈ కారును కొనుగోలు చేయటానికి మొత్తం 6,50,000 పౌండ్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారు కొత్త ఓనర్ అయినా దీనిని జాగ్రత్తగా నడుపుతాడని ఆశిద్దాం.

Picture credit: AOL

More from DriveSpark

Article Published On: Tuesday, September 2, 2014, 12:00 [IST]
English summary
In recent days, there have been a lot of accidents involving supercars. Many were damaged and some beyond repairs. Along this list is a Bugatti Veyron, which was wrecked after a crash and was sold recently for £167,243 in spite of having major damage, like a missing tyre, scraped bodywork and even peeled off panels.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+