ప్రపంచంలో కెల్లా అతిపెద్ద బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం 'ల్యాన్‌క్యాస్టర్ ఈబస్'
పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తు కోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు బ్యాటరీలతో నడిచే ఈకో ఫ్రెండ్లీ వాహనాలను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ టెక్నాలజీని కేవలం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, కార్లకే పరిమితం చేయకుండా బస్సుల వంటి భారీ వాహనాలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి మనదేశంలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వాటిని రోడ్లపై టెస్టింగ్ కూడా చేస్తున్నారు. అయితే, బివైడి మోటార్స్ మాత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సును తయారు చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'ల్యాన్‌క్యాస్టర్ ఈబస్' (Lancaster eBus)గా పిలిచే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సును అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అసోసియేషన్ (ఏపిటిఏ) ఎక్స్‌లో బివైడి మోటార్స్ ఆవిష్కరించింది.
అమెరికా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆర్టిక్యులేటెడ్ బస్సుగా అభివర్ణించబడిన ఈ ల్యాన్‌క్యాస్టర్ ఈబస్‌కు కాలిఫోర్నియాలోని ఓ సిటీ పేరునే పెట్టారు. ల్యాన్‌క్యాస్టర్ అనేది కాలిఫోర్నియాలో ఓ ప్రముఖ నగరం. ఇదే ప్రాంతంలో ల్యాన్‌క్యాస్టర్ ఈబస్సును రెండేళ్ల పాటు శ్రమించి అభివృద్ధి చేశారు. మొత్తం 60 అడుగులు (18.2 మీటర్లు) పొడవున్న ఈ బస్సు చూడటానికి ఇతర బెండీ బస్ (వంపు తిరిగే బస్సుల) మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో అధునాతన అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఈ బస్సులో అమర్చిన బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మొత్తం 120 మంది ప్రయాణీకులతో సింగిల్ చార్జ్‌పై ఏకంగా 179 మైళ్ల (288 కిలోమీటర్ల) దూరం ప్రయాణించవచ్చు. చైనాకి చెందిన బివైడి మోటార్స్ బస్సుల కన్నా బ్యాటరీలను తయారు చేయటంలోనే స్పెషలిస్ట్. కానీ, బస్సు కేవలం బ్యాటరీలను సప్లయ్ చేయటమే కాకుండా, పూర్తి బస్సుని బివైడినే తయారు చేసింది.
ఈ బ్యాటరీలను 10,000 సార్లు రీచార్జ్ చేసుకోవచ్చని, ఆ తర్వాత కూడా ఇవి 70 శాతం చార్జ్‌ని ఆఫర్ చేస్తాయని బివైడి పేర్కొంది. అంటే, ఈ బ్యాటరీల జీవిత కాలం 25 ఏళ్లు అన్నమాట. ఈ బ్యాటరీలు ఫైర్, పంక్చర్స్, క్రషింగ్‌లను తట్టుకునే సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. ఈ బస్సులోని బ్యాటరీల సాయంతో ఇలాంటి ఇతర బస్సులకు చార్జింగ్ అందించవచ్చు. అలాగే, అత్యవసర సమయాల్లో గ్రిడ్ లేదా బిల్డింగ్‌కు కూడా పవర్ అందించవచ్చు. బివైడి ఎలక్ట్రిక్ బస్ టెక్నాలజీ గురించి వివరించే ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/_FnSm63I4kY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








