జులై నుంచి ప్రియం కానున్న ఆటోమొబైల్ వాహనాల ధరలు

By Ravi

జులై 1వ తేది నుంచి కొత్త వాహనాల ధరలు మరింత ప్రియం అయ్యే ఆస్కారం ఉంది. అయితే, దీన్ని నియంత్రించడం కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సర్కారుపై ఆధారపడి ఉంటుంది. ఇదివరకటి సర్కారు (కాంగ్రెస్) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాహనాలపై తగ్గించిన ఎక్సైజ్ సుంకాను తాజాగా జులైలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కూడా కొనసాగించినట్లయితే కార్లు, బైకుల ధరలు పెరగవు.

కానీ, అలాకాకుండా జులై నెలలో కొత్తగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాలను సవరించినా (పెంచినా) వాహనాలను ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది. గడచిన మార్చ్ నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ కంటే ముందున్న బడ్జెట్‌లోని ఎక్సైజ్ డ్యూటీ స్ట్రక్చర్‌నే ఫాలో అవ్వాలని ప్రస్తుత సర్కారు (బిజెపి) భావిస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే వాహనాల ధరలు 4 నుంచి 6 శాతం మధ్యలో పెరిగే ఆస్కారం ఉంది. ఈ విషయంపై మోడీ సర్కారు నుంచి త్వరలోనే ఓ ప్రకటన విడుదల కానుంది.

Cars May Get Costlier From July

సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్‌యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం విధితమే.

More from DriveSpark

Article Published On: Friday, June 20, 2014, 14:54 [IST]
English summary
Vehicle prices are likely to increase from July 1, if the excise cut announced by the previous government is not extended. It is likely that the new government will return to the previous excise duty structure. It could increase the price of bikes, cars and utility vehicles by between 4 per cent and 6 per cent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+