పాట మార్చాలా, జస్ట్ చేయి ఊపితే సరిపోతుంది..!
కార్లలో టెక్నాలజీ రోజుకో కొత్త ఆవిష్కరణకు తెరలేపుతోంది. కార్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కంట్రోల్ చేయటానికి ఇప్పటికే టచ్, వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటే, తాజాగా 'ఎయిర్ గెశ్చర్ కంట్రోల్' అనే కొత్త టెక్నాలజీ పుట్టుకొచ్చింది. ఎయిర్ గెశ్చర్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే గాలిలో చేయిని కదిలించడం ద్వారా కారులోని ఇన్ఫోటైన్‌మైంట్‌ను యాక్సిస్ చేయవచ్చన్నమాట.
అంటే, మీరు డ్రైవ్ చేస్తున్న కారు మ్యూజిక్ సిస్టమ్‌లో పాటను మార్చాలనుకున్నప్పుడు జస్ట్ అలా గాలిలో చేయిని ఊపితే సరిపోతుంది. గడచిన వారం బెర్లిన్‌ల వియ్.కనెక్ట్ కార్ హెచ్ఎమ్ఐ కాన్సెప్ట్స్ అండ్ సిస్టమ్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో సాఫ్ట్‌కైనెటిక్స్ అనే సంస్థ ఈ కొత్త గెశ్చర్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ప్రదర్శించారు.
త్వరలోనే ఈ గెశ్చర్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కార్లలో పరిచయం చేస్తామని సాఫ్ట్‌కైనెటిక్స్ చెబుతోంది. అయితే, ఈ టెక్నాలజీని ముందుగా ఏ కారులో ఉపయోగించబోతున్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. కాగా.. త్వరలోనే దీనికి సంబంధించిన డెమో కూడా ఇవ్వనున్నారు.
కారు డ్యాష్‌బోర్డులో అనేక బటన్లు, నాబ్స్‌ను సెంట్రల్లీ మౌంటెడ్ సెన్సార్లతో రీప్లేస్ చేయనున్నారు. డ్రైవర్ తన కావల్సిన ఫీచర్ కోసం ఆ సెన్సార్ ముందు చేతిని ఊపితే సరిపోతుంది, తర్వాత స్క్రీన్‌పై ఆ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. చిమ్మచీకటిలో కూడా ఈ సెన్సార్లు పనిచేస్తాయని పరిశోధకలు చెబుతున్నారు.
ఈ హ్యాండ్ మూవ్‌మెంట్ కంట్రోల్ ఫీచర్స్ కోసం కొద్ది నిమిషాల ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టెక్నాలజీని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటే మీ కారులోని ఏసి, మ్యూజిక్, నావిగేషన్ ఇలా అనేక ఫీచర్లను అలా గాలిలో చేయి ఊపటం ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. డ్రైవర్ రోడ్డుపై నుంచి తన దృష్టిని మరల్చకుంటా, కారులోని ఫీచర్లను కంట్రోల్ చేయటం ద్వారా వారి ప్రయాణం మరింత సురక్షితం చేయాలని ఉద్దేశ్యంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని పరిశోధకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications









