టాటాతో చేతులు కలిపిన కార్జాన్‌రెంట్; అద్దెకు టాటా నానో
పవర్ స్టీరింగ్‌తో కూడిన టాటా నానో కారు ఇప్పుడు అద్దెకు లభ్యం కానుంది. కేవలం గంటకు రూ.99 చొప్పున అద్దెను చెల్లించి ఈ కారులో ఎంచక్కా షికారు చేయవచ్చు. భారతదేశపు ప్రముఖ వ్యక్తిగత రవాణా సేవలను అందించే సంస్థ కార్జాన్‌రెంట్ మరియు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌లు చేతులు కలిపి మైల్స్ సిటీ డ్రైవ్ పేరిట టాటా నానో రెంటల్ స్కీమ్‌ను పరిచయం చేశాయి.
ప్రస్తుతానికి టాటా నానో అద్దెకు లభించేదులు ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి మాత్రమే పరిమితమైనప్పటికీ, త్వరలో దేశమంతటా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కార్జాన్‌రెంట్ పేర్కొంది. మైల్స్ సిటీ డ్రైవ్ స్కీమ్ క్రింద కింద వినియోగదారులు టాటా నానో ట్విస్ట్ కారును గంటకు రూ.99 లేదా రోజుకు రూ.399 చొప్పున లేదా నెలకు రూ.6,999 చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు.

ఈ స్కీమ్ కోసం 200 టాటా నానో ట్విస్ట్ కార్ల సరఫరా నిమిత్తం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని కార్జాన్‌రెంట్ తెలిపింది. టాటా నానో ట్విస్ట్ కారును ఢిల్లీ-ఎన్‌సిఆర్ రీజియన్‌లో ఉన్న తమ 43 సెంటర్లలో కానీ లేదా ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకోవచ్చని కార్జాన్‌రెంట్ వివరించింది.
మైల్స్ సిటీ డ్రైవ్ స్కీమ్‌ను గత ఏడాది 14 కార్లతో ప్రారంభించామని, ప్రస్తుతం 600 కార్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, మొత్తం 16 నగరాల్లో మహీంద్రా ఈ20 నుంచి మెర్సిడెస్-బెంజ్ వరకూ కార్లను అద్దెకు ఇస్తున్నామని, త్వరలో ఈ తరహా సేవలను దేశమంతటా విస్తరిస్తామని కార్జాన్‌రెంట్ తెలిపింది.


Click it and Unblock the Notifications








