సిటీలో నడిపే వాహనాల కోసం క్యాస్ట్రాల్ స్టార్ట్-స్టాప్ ఇంజన్ ఆయిల్
ప్రపంచపు అగ్రగామి ఇంజన్ ఆయిల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్యాస్ట్రాల్, నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై తిరిగే వాహనాల్లోని ఇంజన్ పరిరక్షణ కోసం ఓ సరికొత్త ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేసింది. సిటీలో నడిపే వాహనాలను ట్రాఫిక్ రద్దీని బట్టి బెటర్ మైలేజ్ కోసం నిత్యం ఆపుతూ, ఆన్ చేస్తూ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా డ్రైవ్ చేయటం వలన ఇంజన్‌పై అదనపు భారం పడి, లోపలి భాగాలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు 'క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్' పేరిట ఓ కొత్త ఇంజన్ ఆయిల్‌ను ప్రవేశపెట్టింది.
స్టాప్-స్టార్ట్ డ్రైవింగ్ వలన ఇంజన్ లోపల జరిగే నష్టాన్ని నివారించేందుకు ఈ కొత్త ఇంజన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. పిల్లను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు, షాపులకు వెళ్లేటప్పుడు, లేదా రద్దీగా ఉండే రోడ్లపై ప్రధాన కూడళ్లలో ఇంజన్‌ను ఆన్-ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేసేటప్పుడు ఇంజన్‌పై అదనపు భారం పడకుండా, లోపలి భాగాలు దెబ్బతినకుండా ఉండేలా ఈ కొత్త క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ సహకరిస్తుందని కంపెనీ వివరించింది.

వాహనాన్ని తరచూ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేయటవం వలన ఇంజన్‌లో కలిగే డ్యామేజ్‌ను నివారించేలా క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్‌ను అభివృద్ధి చేశామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక క్యాస్ట్రాల్ టెక్నాలజీ సెంటర్లలోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తల అభివృద్ధి ఫలమే ఈ క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ అని కంపెనీ తెలిపింది.
క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ లోని ఇంటెలిజెంట్ మాలిక్యూల్స్ ఇంజన్‌లోని కీలక భాగాలను అంటిపెట్టుకొని ఉండి, ఓ సెల్ఫ్-హీలింగ్ లేయర్‌ను ఏర్పాటు చేస్తాయని, ఒకవేళ ఇంజన్ రన్నింగ్‌లో కొన్ని మాలిక్యూల్స్ తొలగిపోయినా ఇతర మాలిక్యూల్స్ ఓ ప్రొటెక్టివ్ లేయర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాయని క్యాస్ట్రాల్ వివరించింది. అన్ని అధీకృత ఇంజన్ ఆయిల్ డీలర్స్ వద్ద ఈ కొత్త స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








