ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీ
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లోకి కొత్త కొత్త బ్రాండ్‌లు వచ్చి చేరుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో అనేక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలను మనం చూసే అవకాశం ఉంది.
జనరల్ మోటార్స్ ఇండియా కూడా ఓ షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. ఈ సెగ్గమెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీనిచ్చేలా షెవర్లే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఢిల్లీలో ప్రదర్శించనుంది.
జనరల్ మోటార్స్ నుంచి పాపులర్ అయిన గమ్మా 2 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే ప్లాట్‌ఫామ్‌పై షెవర్లే బీట్, ఏవియో, ట్రాక్స్ వంటి మోడళ్లను తయారు చేస్తున్నారు.

ఈ షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 77 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను షెవర్లే సెయిల్ సెడాన్ మరియు షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలలో ఉపయోగిస్తున్నారు.
అయితే, జనరల్ మోటార్స్ తమ షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శిస్తుందా లేక ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న మోడల్‌ను ప్రదర్శిస్తుందా అనే విషయం మాత్రం తెలియరాలేదు. షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటుగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బీట్‌తో పాటుగా ఇతర మోడళ్లను కూడా ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








