అప్‌గ్రేడెడ్ 2015 షెవర్లే క్రూజ్ సెడాన్ వస్తోంది!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్‌కి చెందిన షెవర్లే బ్రాండ్‌లో లభిస్తున్న పవర్‌ఫుల్ ప్రీమియం సెడాన్ 'క్రూజ్' త్వరలోనే కొత్త గెటప్‌లో కనిపించనుంది. మరో రెండు రోజుల్లో 2014 న్యూయార్క్ ఆటో షో ప్రారంభం కానున్న నేపథ్యంలో జనరల్ మోటార్స్ అప్‌డేటెట్ 2015 క్రూయిజ్ సెడాన్ ఫొటోలను, వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.
కొత్త షెవర్లే క్రూజ్‌లో ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్‌లతో పాటుగా ఇంటీరియర్ మరియు టెక్నాలజీ అప్‌డేట్స్ కూడా ఉండనున్నాయి. జనరల్ మోటార్స్ ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ షెవర్లే క్రూజ్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, న్యూయార్క్ మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించనున్న ఈ సరికొత్త 2015 షెవర్లే క్రూజ్ మార్కెట్లోకి రావటానికి మరో రెండేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్న 2014 బీజింగ్ మోటార్ షోలో చైనీస్ వెర్షన్ 2015 షెవర్లే క్రూజ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ మోడల్‌ను చైనా రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నారు. మలిబు సెడాన్ మరియు కొత్త ఇంపాలా కార్ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఎక్స్టీరియర్స్‌ను కొత్త క్రూజ్‌లో చూడొచ్చు. ఇంకా ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కొత్త 2015 షెవర్లే క్రూజ్‌కు సంబంధిం ఇంటీరియర్ ఫొటోలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞనాంతో తయారు చేయబడిన ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంజన్స్ గురించి కూడా కంపెనీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ కొత్త షెవర్లే క్రూజ్‌లో ఉపయోగించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








