షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్
జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్‌లలో కంపెనీ అప్‌డెటెడ్ వెర్షన్లను విడుదల చేయనుంది. ఇదివరకటి సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్ మరియు సెయిల్ సెడాన్లతో పోల్చుకుంటే మరింత బెస్ట్ ఫిట్ అండ్ ఫినిష్‌తో పాటుగా ఇంప్రూవ్డ్ క్వాలిటీతో కూడిన ఇంటీరియర్స్‌ను కలిగి ఉండేలా వీటిని అప్‌గ్రేడ్ చేయనున్నారు.
బ్లాక్ అండ్ బీజ్ ప్లాస్టిక్స్‌తో కూడిన డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, బ్లాక్ స్టీరింగ్ వీల్ ఇందులో ప్రధాన మార్పులుగా తెలుస్తోంది. అంతేకాకుండా, క్యాబిన్ లోపల మరింత నాణ్యమైన మెటీరియల్స్‌ను ఉపయోగించనున్నారు. సెప్టెంబర్ 24, 2014వ తేదీన కొత్త సెయిల్ మోడళ్లు విడుదల కానున్నాయి.
కొత్త షెవర్లే సెయిల్ మోడళ్ల ఎక్స్టీరియర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఫాగ్ ల్యాంప్స్ మరియు వెనుక డిజైన్‌లో క్రోమ్ గార్నిష్ వంటి మార్పులు ఉండనున్నాయి. ఈ కొత్త వెర్షన్ సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని అంచనా.



Click it and Unblock the Notifications








