ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల షెవర్లే బీట్ కార్ల విక్రయం!

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్‌కి చెందిన షెవర్లే బ్రాండ్, మినీ కార్ సేల్స్‌లో ఓ పెద్ద అంకెను చేరుకుంది. షెవర్లే బ్రాండ్‌లో లభిస్తున్న చిన్న కారు 'బీట్' (Beat) ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల (1 మిలియన్) అమ్మకాలను నమోదు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

షెవర్లే బీట్ భారతదేశంలో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ హ్యాచ్‌బ్యాక్ అని, స్వదేశంలోను మరియు విదేశాల్లో యువ కొనగోలుదారుల నుంచి ఈ కారుకు ఆదరణ పెరుగుతోందని, దీని టెక్నాలజీని అందరూ ప్రశంసిస్తున్నారని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా వ్యాఖ్యానించారు.

షెవర్లే బీట్ భారత్‌లో మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో, పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్‌ను విడుదల చేయటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. షెవర్లే బీట్‌ను తొలిసారిగా 2009 సంవత్సరం చివర్లో విడుదల చేశారు. డీజిల్ వెర్షన్ బీట్ లీటరుకు 25.44 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌లలో కెల్లా ఇదే అత్యధిక మైలేజీచ్చే హ్యాచ్‌బ్యాక్.

Chevrolet Sells More than 1 Million Beats Worldwide

షెవర్లే బీట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఒక్క ఇండియాలోనే 1,78,000 బీట్ కార్లు అమ్ముడుపోయాయి. షెవర్లే బీట్ తక్కువ ధర కలిగిన చిన్న కారు అయినప్పటికీ, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, సరికొత్త సిల్వర్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

ప్రస్తుతం షెవర్లే బీట్ ప్రపంచ వ్యాప్తంగా 71 మార్కెట్లలో లభ్యం కానుంది. ఈ మోడల్ అమ్మకాలు ఎక్కువగా దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు మెక్సిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం బీట్ అమ్మకాలలో 10 శాతం అమ్మకాలు యునైటెడ్ స్టేట్స్‌లో నమోదవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, October 10, 2014, 14:28 [IST]
English summary
Chevrolet has reached a big number in mini car sales, surpassing 1 million sales worldwide of the Beat which is known as Spark in foreign markets.  This demonstrates the growing acceptance of Chevrolet’s small car lineup attracting more people to the brand around the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+