డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.30,000 డిస్కౌంట్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కి చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్, ఈ ఏడాది మార్చ్ నెలలో కేవలం రూ. 3.12 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే భారత్‌లో విడుదల తమ 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇటీవలే గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ మోడల్ జీరో రేటింగ్‌ను దక్కించుకోవటంతో దీని అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

ఈ నేపథ్యంలో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను పెంచుకునేందుకు నిస్సాన్ ఈ మోడల్‌పై రూ.30,000 ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా, రూ.15,000ల ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.15,000ల విలువైన ఇతర ప్రయోజనాలను (మొత్తంగా రూ.30,000ల విలువైన ప్రయోజనాల)ను డాట్సన్ అందిస్తోంది. ఈ ఆఫర్లు డాట్సన్ డి, డి1 మరియు ఏ వేరియంట్లపై అందుబాటులో ఉంటాయి.

ఈ తగ్గింపులు డిసెంబర్ 31, 2014 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని నిస్సాన్ డీలరును సంప్రదించండి.

Datsun Go Offer

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తయారు చేశారు. నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో కెల్లా మొదటిసారిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం రోడ్-సైడ్ అసిస్టెన్స్‌‌ను మరియు 2 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు వేరియంట్లు, నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, సిల్వర్, స్కై బ్లూ, రూబీ రెడ్) లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 9, 2014, 14:03 [IST]
English summary
Buyers opting for Datsun's Go can avail a cash discount of INR 30,000. The offer is valid for the month of December, 2014 only. It includes a INR 15,000 exchange benefit, along with INR 15,000 of additional discounts. The discounts will end on 31st of December, 2014 in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+