జనవరి 2015లో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విడుదల
నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్లో తమ రెండవ ఉత్పత్తి 'గో ప్లస్' (Go+) ఎమ్‌పివి వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్‌కు సంబంధించిన ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైనట్లు కూడా సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి పెట్లో వెర్షన్‌తో పాటుగా డీజిల్ వెర్షన్‌లో కూడా లభ్యం కానుంది.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు గుయ్‌లామ్ సికర్డ్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసినదే. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'గో ప్లస్' ఎమ్‌పివిని గడచిన ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ ఇండియా తొలిసారిగా ఆవిష్కరించింది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే గో ప్లస్ ఎమ్‌పివిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించి దీనిని తయారు చేస్తున్నారు.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మొత్తం 3995 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ఇదొక సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎమ్‌పివి. ఎక్సైజ్ రాయితీలను పొందుతుంది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌రూమ్ ఉంటుంది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉంటుంది. డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత స్థలాన్ని పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు. మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు కానీ లేదా కొంచెం లావుగా ఉన్న వారు కానీ ఇందులో సౌకర్యంగా కూర్చోలేరు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








