డాట్సన్ గో టివిసి: ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్

By Ravi

నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్, ఈ ఏడాది మార్చ్ నెలలో కేవలం రూ. 3.12 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే భారత్‌లో విడుదల తమ 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెటింగ్ చేసుకునేందుకు కంపెనీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, డాట్సన్ గో కారు కోసం కంపెనీ ఓ విశిష్టమైన టెలివిజన్ కమర్షియల్‌ను తయారు చేసింది.

నయా పరంపర (న్యూ ట్రెండ్) అనే థీమ్‌తో ఈ ప్రకటన సాగుతోంది. ఇందులో ఆల్టో, వ్యాగన్ఆర్, శాంత్రో మొదలైన పాత మోడళ్లతో కొత్త డాట్సన్ గో కారును పోల్చుతూ, ఈ మోడల్‌ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/TDgIZBPl14M?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తయారు చేశారు. నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో కెల్లా మొదటిసారిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం రోడ్-సైడ్ అసిస్టెన్స్‌‌ను మరియు 2 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు వేరియంట్లు, నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, సిల్వర్, స్కై బ్లూ, రూబీ రెడ్) లభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2014, 17:44 [IST]
English summary
Datsun have introduced a new TVC in India, attempting to change the perspective of Indian car buyers. They smartly used the ‘Nayi Parampara' theme for its hatchback commercial. In the advert you will notice several Maruti Suzuki and Hyundai small car owners envying the Datsun GO owner.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+